ఆమరణ నిరహరదీక్ష  హెచ్చరికతో Group I Preliminary పరీక్ష  రద్దు

బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ 

ఆమరణ నిరహరదీక్ష  హెచ్చరికతో Group I Preliminary పరీక్ష  రద్దు

హైదరాబాద్, మార్చి 17 : TSPSC పేపర్స్ లీకేజ్ వ్యవహరంపై బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అల్టిమెటం ఇవ్వడంతోనే Group I ప్రిలిమ్సి పేపరు రద్దు చేశారు. రెండు రోజుల క్రితం TSPSC పేపర్స్ లీకేజ్ కు సంబంధించి 48 గంటల్లో పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరహరదీక్ష చేస్తానని హెచ్చరించారు. 

అయితే.. శుక్రవారం బిఎస్ పి కార్యాలయంలో ఆమరణ నిరహర దీక్షకు కూర్చున్న బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు.  కాగా ప్రవీణ్ కుమార్ కోరినట్లుగా గ్రూప్ 1 తో పాటు అన్ని పరీక్షలను రద్దు చేయడంతో బిఎస్ పి కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఐపిఎస్ ఆఫీసర్ గా ప్రవీణ్ కుమార్ ఇలాంటి కేసులు చూసినందున ఆందోళనకు దిగడం వల్లే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపి పరీక్షలను రద్దు చేసిందని వారు పేర్కొంటున్నారు.

గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దుతో ఇది Group I aspirants కు Dr. R. S. Praveen Kumar గారు ఇచ్చిన ఊరట గా చెప్పొచ్చు అంటున్నారు.

బిఎస్ పి కి మద్దతుగా.. 

TSPSC లో పేపర్ల లీకులను నిరసిస్తూ ఆయా పరీక్షలను రద్దు చేయాలని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు డా. అర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారు BSP పార్టీలో ఆమరణ దీక్షను చేపడితే ఆ దీక్షను భగ్నం చేసి డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారిని అరెస్ట్ చేసి ఆయన ఇంటికి తరలించి హౌస్ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఓయూలో బహుజన విద్యార్థి సంఘాలు మరియు ఓయు జాక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 

అనంతరం ఓయు విద్యార్థి నాయకులు బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజయ్, ఓయూ జేఏసీ చైర్మైన్ కోతపల్లి తిరుపతి, BSF ఉపాధ్యక్షుడు పులిగంటి వేణుగోపాల్, ఓయు అధ్యక్షుడు పోమాల అంబేడ్కర్, తగరపు నవీన్ ,భాస్కర్, ప్రవీణ్ ఆనంద్, సత్యం ,ఆనంద్, స్వామి యుగంధర్. మరియు తదితర నాయకులను అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!