కేటీఆర్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన క్యామ మల్లేష్
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్ కేటీఆర్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల ముందు చేసిన కొన్ని తప్పిదాలవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.
పట్నం మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ, తమ్ముడికి ఎమ్మెల్యే , భార్య ఉమ్మడి జిల్లా పరిషత్ కు చైర్మన్ ఆమె మళ్లీ చిన్న జిల్లాకు చైర్మన్ పర్సన్ చేశారన్నారు. ఇప్పుడేమో వాళ్లంతా పార్టీ నుండి గయాబ్ అయ్యారని, పార్టీని మోసేటోళ్ళకి సీట్లు, అధికారం ఇవ్వాలని, పార్టీని మోసం చేసెటోళ్ళకీ ఎలాంటి అవకాశాలు ఇవ్వోదని జనం ముందు వేదికపైనే నిలదిశారు.
దీంతో కేటీఆర్ ఆశ్చర్యానికి లోనయ్యారు.అంతే కాదు భువనగిరి పార్లమెంట్ నుండి రాహుల్ గాంధి కానీ ప్రియాంకగాంధి కానీ పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి అదే నిజమైతే బీఆర్ఏస్ పార్టీ నుండి ఉద్యమకారుల కుటుంబం నుంచి ఒక దళిత మహిళలకు అవకాశం కల్పించాలని కోరారు.