12 నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలు

12 నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలు

హైదరాబాద్, నిర్దేశం:
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈనెల 11న  మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జ‌ర‌గ‌నుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరగనున్న స‌మావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌రుకానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాలేదు. గత బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు అసెంబ్లీకి హాజరై ఆ తర్వాత మళ్లీ అడుగుపెట్టలేదు. ఈ నెల 12 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాలకు మాత్రం  హాజరుకావాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ నేతలకు తెలియజేసినట్లు సమాచారం. పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు ప్రకటన రావడంతో కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఖాయమైనట్లేనని తెలుస్తోంది. ఒకవేళ కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోతే ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లోనే శాసనసభా పక్ష సమావేశం జరిగేదని పార్టీ నేతలు చెబుతున్నారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకే కేసీఆర్ హైదరాబాద్ వస్తున్నారని.. అందుకే ఇక్కడే పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారని, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్‌ను ఎండగడుతారని చర్చ సాగుతోంది.12వ తేదీ నుంచి మొదల్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 వరకు జరిగే అవకాశం ఉంది. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరుసటి రోజు రెండు సభల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు. కానీ, బడ్జెట్‌ ఏ రోజు ప్రవేశ పెడుతారు, పద్దులపై ఎన్ని రోజులు చర్చిస్తారు అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »