బుడగ జంగాల కులంలో డాక్టరేట్ అరుదు
అధ్యాపకుడు సిరిగిరి గురుస్వామికి డాక్టరేట్
కఠోరా శ్రమతో పరిశోధన చేస్తే డాక్టరేట్ పట్టా వెల్ కమ్ చెబుతుంది. ఇగో.. పాలమూరు విశ్వవిద్యాలయంలో జంతు శాస్త్ర విభాగంలో అధ్యాపకుడిగా సేవలందిస్తున్న సిరిగిరి గురుస్వామికి డాక్టరేట్ పట్టా ప్రకటించింది ఉస్మానియా యూనివర్సిటీ.
బుడగ జంగాల కులంలో బతుకడానికి నాన ఆవస్థలు పడుతారు. ఆర్థికంగా వెనుక బడిన జాతీకి చెందిన సిరిగిరి గురుస్వామి డాక్టరేట్ పట్టా సాధించడం పట్ల ఆ జాతీ గర్వ పడుతుంది.
వనపర్తి జిల్లా పెబ్బేరు మండల పరిధిలోని చెలిమిల్ల గ్రామానికి చెందిన కడు నిరుపేద కుటుంబంలో సిరిగిరి మునెమ్మ భీమయ్య రెండవ కుమారుదుగా సిరిగిరి గురుస్వామి జన్మిచాడు.
చదువుతోనే భవిష్యత్ బాగుంటుందని నమ్మిన అతను ఉన్నత చదువులు లక్ష్యంగా అడుగులు వేశారు. అంతే.. చదువుకు బీదరికం అడ్డు రాదని భావించిన అతను ఏకంగా డాక్టరేట్ పట్టా సాధించి అందరితో శబ్బాష్ అనిపించుకున్నారు.
సిరిగిరి గురుస్వామి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి జంతుశాస్త్రంలో, ఎంఎస్సితో, బీఈడీ పట్టాను సాధించారు. ఉన్నత విద్య బోధనకు కావలసిన సెట్ అర్హతను సాధించాడు అతను. పాలమూరు విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులునిర్వహిస్తున్నాడు.
బోధనతో పాటు యూనివర్సిటీ కి సంబంధించి వివిధ అదనపు బాధ్యతలు నిర్వహించాడు. జంతు శాస్త్రంలో విభాగదిపతిగా పనిచేశారు. జంతుశాస్త్ర విద్యార్థులకు వ్యవసాయ కీటక శాస్త్రాన్ని బోధిస్తూ వ్యవసాయ రంగంపై, కనరాని కీటకాల నివారణపై అవగాహన పెంపొందిస్తున్నారు.
డైవర్సిటీ అండ్ ఎకాలజీ ఆఫ్ స్పైడర్ పాన ఇన్ డిఫరెంట్ ఆగ్రో ఎకో సిస్టమ్స్ ఆఫ్ మహబుూబ్ నగర్ తెలంగాణ అనే అంశంపై విస్తృత పరిశోధన చేసారు అతను. ఉస్మానియా విశ్వవిద్యాలయం అతనికి జంతుశాస్త్ర విభాగం నుండి డాక్టరేట్ పట్టా లభించింది. జంతు శాస్త్ర విభాగధిపతి ఆచార్య మాధవి పర్యవేక్షణలో గురు స్వామి పీహెచ్ డి పరిశోధన చేశాడు. ఇతడు జాతీయ, అంతర్జాతీయ సదస్సులో పలు పరిశోధన పత్రాలను సమర్పించి విద్యారంగా నిపుణులచే ప్రశంసలు అందుకున్నాడు.
డాక్టరేట్ వచ్చిన సందర్భంగా మర్యాదపూర్వకంగా వీసి రిజిస్టర్ ను కలిసి పుష్పగుచ్చం అందించాడు గురుస్వామి. అతను భవిష్యత్తులో మరిన్ని పరిశోధన పత్రాలు రూపొందించి ఉత్తమ అధ్యాపకుడిగా ఎదగాలని వీజీ రిజిస్టర్, ఓఎస్టి అధ్యాపకులు అభినందించారు.