యువకుడి దారుణ హత్య
అదిలాబాద్, నిర్దేశం:
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ యువకుడు దారుణ హత్య కు గురయ్యాడు. మార్కెట్ యార్డ్ వెనకాల ఇందిరా నగర్ లో రవితేజ (30) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ బృందాల తో ఆధారాలు సేకరిస్తున్నారు. సంఘటన స్థలాన్ని డిఎస్పీ జీవన్ రెడ్డి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ కు తరలించారు. మృతుడు క్రాంతి నగర్ వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది