డివైడర్ ను ఢీకొన్న బీఎండబ్ల్యూ
హైదరాబాద్, నిర్దేశం
హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద బి.ఎం. డబ్ల్యూ. కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ చెక్ ఫాస్ట్ ట్రాఫిక్ పోలీస్ బూత్ దిమ్మెల్ని అతివేగంతో కారు ఢీకొట్టింది. ఆదుపు తప్పి డివైడర్ దిమ్మెల్ని ఢీకొనడంతో కారు టైర్, ఆయిల్ ట్యాoకర్ పగిలిపోయాయి. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసి ఉంటాడనే అనుమానాలు వున్నాయి. కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో డ్రైవర్ కారు దిగి పరారైయాడు.
జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.