తాగుబోతు కొడుకును కడతేర్చిన తల్లి
ఒంగోలు, నిర్దేశం:
మద్యానికి బానిసై తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కన్న కొడుకును కన్న తల్లే హత్యచేయించింది. ప్రకాశం జిల్లాలో చెందిన సాలమ్మకు నలుగురు పిల్లలు.. మూడో వాడైన శ్యాంబాబు(35) మద్యానికి బానిసై దొంగతనాలు కూడా చేసేవాడు. కొద్దిరోజుల కిందట మద్యం మత్తులో బంధువుల అమ్మాయితోను, చివరికి తల్లితోను అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విసిగిన పోయిన సాలమ్మ ఒక ఆటో డ్రైవర్ కు సుపారి ఇచ్చి, కొడుకును ముక్కలుగా నరికి పంట కాలువలో పడేసింది. మృతదేహాన్ని మూడు సంచుల్లో పెట్టి కాలువలో పడేసారు. కాల్వగట్టుపై రక్తపు మరకలు చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు విచారణలోతల్లి సారమ్మల నేరం అంగీకరించింది. ఇద్దరు సోదరులు మరొక వ్యక్తి సహాయంతో హత్య చేయించినట్లు వెల్లడించింది.