బీజేపీవి ఆరాచకాలు : మంత్రి జగదీష్
సూర్యాపేట : కేంద్ర ప్రభుత్వoపై రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. బిజెపి దుర్మార్గాలకు పరాకాష్ట ఆప్ నేత సిసోడియా అరెస్ట్ కావడమన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ.డీ, ఐ.టీ, సిబిఐ వంటి సంస్థలు బిజెపి నేతలు చేసిన ఆరోపణల కోసం మాత్రమే కేంద్ర నిఘా సంస్థలు పనిచేస్తున్నాయన్నారు ఆయన. ఎమర్జెన్సీకి మించిన దారుణమైన పరిస్థితులు దేశంలో కొనసాగుతున్నాయని ఆరోపించారు. బిజెపేతర రాష్ట్ర ప్రభుత్వాలపై.. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అప్రజాస్వామికమన్నారు. బిజెపి అరాచకాలు ఇలానే కొనసాగితే దేశ ప్రజల నుండి తిరుగుబాటు తప్పదన్నారు ఆయన. అణచివేతల ద్వారా చరిత్రలో ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేదు. బిజెపికి బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.