సుదూర తీరాన సింధూర కెరటాలు
గల్ఫ్ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం
దుబాయ్ : ఇండియన్ పీపుల్స్ ఫోరం (దుబాయి) తెలంగాణ కౌన్సిల్ ఆధ్వర్యంలో దుబాయిలోని ఆల్కుజ్ ప్రాంతంలోని అంబాసిడర్ స్కూల్ లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన తెలంగాణ గల్ఫ్ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం విజయవంతమైంది. బ్రతుకు తెరువు కోసం దుబాయ్, అబుదాబి, షార్జా తదితరల గల్ఫ్ దేశాలకు వలస వచ్చిన కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
తెలంగాణ గల్ఫ్ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఇంచార్జి డాక్టర్ విజయ్ చౌతైవాలే, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక వింగ్ ఎర్పాటు చేసి వారి సమస్యలు తీర్చడంతో పాటు, తెలంగాణ గల్ఫ్ కార్మికులు కోరుకునే గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో చర్చించి గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు జితేంద్ర వైద్య, జాతీయ ప్రధాన కార్యదర్శి రంజిత్ కొడోత్, తెలంగాణ కౌన్సిల్ కన్వీనర్ కుంబాల మహేందర్ రెడ్జి, తెలంగాణ కౌన్సిల్ కార్యదర్శి మదన్, నవనీత్, శరత్, వంశీ, బొమ్మిడి బాలు, కచ్చు కొమురయ్య, జంగం బాలకిషన్, రవిడేవిడ్, ఎలిగేటి గంగాధర్, మోహన్ రెడ్జిలతో పాటు జాతీయ చేనేత ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోగ వేణుగోపాల్ నేత, ఊట్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గల్ఫ్ కార్మికులను సన్మానించారు.