‘హిందు’ వివాదాల్లో బిత్తిరి సత్తి…
- తీన్మార్ వార్తలతో సెలబ్రిటీగా..
- సినిమాలలో హీరోగా..
- భగవద్గీతపై వివాదాస్పదా వ్యాఖ్యలు..
- సెలబ్రిటీ ఇమేజ్ను దుర్వినియోగం..
- హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్..
- హిందువులను అవమాన పరుచలేదుంటున్న బిత్తిరి సత్తి..
(వయ్యామ్మెస్ ఉదయశ్రీ)
బిత్తిరి సత్తి అలియాస్ చేవేళ్ల రవి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. పలు న్యూస్ ఛానెళ్లలో పనిచేసిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణ యాస, వింతైన హావభావాలతో అందరినీ ఆకట్టుకున్నారు. కానీ.. ఇప్పుడు ఆ బిత్తిరి సత్తి వివాదాలలో ఇరుక్కున్నారు.
తీన్మార్ వార్తలతో సెలబ్రిటీగా..
వీ6లో ప్రసారమయ్యే తీన్మార్ వార్తలతో వెలుగులోకి వచ్చాడు. తర్వాత టీవీ9, సాక్షి న్యూస్ ఛానెళ్లలోనూ పనిచేశారు. వీ6లో సావిత్రి, బిత్తిరి సత్తి కాంబినేషన్ బాగా సక్సెస్ అయింది. అయితే తర్వాత కాలంలో ఆ వార్తల రేటింగ్ తగ్గడంతో బిత్తిరి సత్తి బయటకు వచ్చేశారు.
సినిమాలలో హీరోగా..
న్యూస్ రీడర్‌గా ఉన్నప్పుడే కొన్ని సినిమాల్లో నటించారు. తుపాకి రాముడు సినిమాలో హీరోగా కూడా చేశారు. కొన్ని సినిమా ఫంక్షన్లకు యాంకర్‌గా, గెస్ట్‌గా, వ్యవహరించారు. కొన్ని టీవీ ప్రోగ్రాంలలో కూడా పార్టిసిపేట్ చేశారు.
ముదిరాజ్ సామాజిక వర్గం..
బిత్తిరి సత్తి మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆయన జీరో స్థాయి నుంచి హీరో వరకు ఎదిగాడు. ఇందుకు ఎంతో కష్టపడ్డాడు. న్యూస్ రీడర్ నుంచి సినిమాలో హీరోగా కూడా చేశారు.
భగవద్గీతపై వివాదాస్పదా వ్యాఖ్యలు..
ప్రస్తుతం సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని ప్రోగ్రాంలు చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నాడు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీతను కించపరిచేలా బిత్తిరిసత్తి చేసిన వీడియో ఇపుడు కాంట్రవర్సీకి కారణమైంది. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. దీంతో ఆగ్రహించిన ఈ సంఘాలు బిత్తిరి సత్తిపై సైబర్ క్రై మ్ లో ఫిర్యాదు చేశాయి. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
సెలబ్రిటీ ఇమేజ్ను దుర్వినియోగం..
అయితే.. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉంటాలంటారు. కానీ బిత్తిరి సత్తి.. తన సెలబ్రిటీ ఇమేజ్ను దుర్వినియోగం చేసి చాలాసార్లు కాంట్రవర్సీ అయ్యాడు. తాజాగా ఆయన చేసిన ఓ వీడియోలో భగవద్గీతను అనుకరిస్తూ.. తనదైన శైలిలో వ్యంగ్యంగా బిత్తిరి సత్తి చేసిన స్కిట్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు.
హిందువులకు క్షమాపణలు చెప్పాలి..
అటు హిందూ సంఘాలు కూడా ఈ బిత్తిరి సత్తి చేసిన ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వీడియో హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని మండిపడుతున్నాయి. ఈ సందర్బంగా ప్రముఖ హిందూ సంఘం అయిన రాష్ట్రీయ వానరసేన వాళ్లు ఈ వీడియోపై బిత్తిరి సత్తికి అల్టీమేటం జారీ చేశారు. అంతేకాదు సోషల్ మీడియాలో వీడియోను తెగించి హిందూ సంఘాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
హిందువులను కించపరుచలే..
బిత్తిరి సత్తి తన వీడియోలో హిందువులను కించపరిచేలా లేవని సమర్ధించుకున్నాడు. హిందూ సంఘాలు తనపై ఎలాంటి కేసులు పెట్టిన ఎదుర్కోవడానికి సిద్దమని వాళ్లకు సవాల్ విసిరారు. దీంతో హిందూ వానర సేన సభ్యులు సైబర్ క్రై మ్ పోలీసులను ఆశ్రయించి బిత్తిరి సత్తిపై కేసు నమోదు చేయాలని కోరారు. తాను సరదాగా చేసిన వీడియో అది అని తెలిపారు. కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవరీని కించపరచాలన్న ఉద్దేశ్యం తనది కాదని వివరించారు. చిన్న అక్షర దోషం వలన అలా జరిగిందన్నారు. ఎవరైనా బాధపడితే తాను క్షమాపణలు చెబుతున్నానంటూ చెప్పుకొచ్చారు. తాను కూడా భగవద్గీతను చదువుతానని వెల్లడించారు బిత్తిరి సత్తి.