కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బర్రెలక్క..

బర్రెలక్కా.. ఎవరికీ భయ పడదు..

  • డిగ్రీ చదివింది.. పశువులు కాసింది..
  • ఇన్ స్టా గ్రాం ద్వారా ఫేమాస్ అయ్యింది..
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు పోస్ట్ చేసింది
  • కోర్టు చుట్టూ తిరుగుతుంది
  • ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది..

శిరీష.. ఈ పేరు చెబితే గుర్తించే వాళ్లుండక పోవచ్చు.. కానీ.. బర్రెలక్కా.. అంటే ఠక్కున గుర్తుకు వస్తోంది ఆమె. గ్రాడ్యువేషన్ పూర్తి చేసిన బర్రెలక్క లక్షలాది మంది నిరుద్యోగుల్లాగానే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యింది. కానీ.. ఆ శిరీషకు జాబ్ రాలేదు. ‘‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’’గా భావించిన ఆమె ఇంటికి వెళ్లి నాలుగు బర్లను కొనుక్కొని వాటిని మేపుతూ వీడియోలు తీస్తూ ఇన్ స్టా గ్రాం లో పోస్టు చేస్తోంది. అమాయకంగా మాట్లాడుతూ పల్లెటూరి విశేషాలను చెప్పే శిరీషను ప్రేమతో బర్రెలక్కా.. అంటూ పిలుస్తారు జనం.

ఆ బర్రెలక్కపై పోలీసు కేసు..

బర్రెలక్కది కళ్ల ముందు జరిగే అన్యాయాలను ప్రశ్నించే తత్వం.. తెలంగాణ ప్రభుత్వం సమస్యలను పట్టించుకోవడం లేదని బర్రెలతో వీడియో తీసి తన ఇన్ స్టా గ్రాంలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే.. ప్రభుత్వానికి కోపం వచ్చింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ బర్రెలక్కపై కేసు పెట్టారు. ఇప్పుడామె కోర్టు చుట్టూ తిరుగుతుంది. అయినా ఆ బర్రెలక్క మానసికంగా కృంగి పోలేదు. మొక్కవోని ధైర్యంతో ముందుకు అడుగుటు వేస్తోంది.  ఆమె ధైర్యానికి ఔరా.. అంటున్నారు జనం.

ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బర్రెలక్క

ఔను.. మీరు విన్నది నిజమే.. బర్రెలక్క ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి సై అంటుంది. ఆమె నామినేషన్ వేసి పోటీ చేయడంతోనే గెలిచిందంటున్నారు జనం. సోషల్ మీడియాలో ఇప్పుడు వీఐపీ అయ్యింది. ప్రతి రోజు సోషల్ మీడియాలో ఇంటార్వ్యూలతో బిజీ బిజీగా ఉంటుంది.

ఎమ్మెల్యేగా గెలిపిస్తే…

నిరుద్యోగంతో యువత తీవ్ర ఇబ్బందులకు గురైతున్నందున తాను ఎమ్మెల్యేగా గెలిస్తే తనలాంటి యువత కోసం పని చేస్తానని అంటున్నారు కొల్లాపూర్ నియోజకవర్గం స్వతంత్ర్య అభ్యర్థి శిరీష అలియాస్ బర్రెలక్క.

మనం కూడా ఆ బర్రెలక్కకు ఆల్ ది బెస్ట్ చెబుదాం..

– వయ్యామ్మెస్ ఉదయశ్రీ

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!