అన్నదమ్ములను ఒకటి చేసిన ‘బలగం’ సినిమా

స్థల వివాదం కారణంగా ఏండ్లుగా గొడవలు..

‘బలగం’తో ఒక్కటైన అన్నదమ్ములు

నిర్మల్‌ చైన్‌గేట్‌, ఏప్రిల్‌ 3 (వైడ్ న్యూస్) : స్థల వివాదం కారణంగా ఎన్నో ఏండ్లుగా గొడవలు పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను బలగం సినిమా ఒక్కటి చేసింది. ఈ సంఘటన నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలో జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మణచాంద గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గుర్రం పోసులు, గుర్రం రవి స్థల వివాదం కారణంగా ఏండ్ల తరబడి గొడవలు పడుతున్నారు.

కాగా.. లక్ష్మణచాంద గ్రామ సర్పంచ్‌ సూరకంటి ముత్యంరెడ్డి శనివారం గ్రామంలో బలగం సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. ఈ సినిమాను చూసిన ఆ అన్నదమ్ములు మనసు మార్చుకొని ఆదివారం స్థల వివాదాన్ని పరిష్కరించుకొన్నారు. గ్రామ పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »