పిల్లలను పట్టుకుని బోరున విలపించిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే భార్య ఆత్మహత్యకు కారణాలు ఇవేనా..?
- అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుందా..?
- ఆమె చావుకు ఆనారోగ్యమా..? కుటుంబ కలహాలా..?
(వయ్యామ్మెస్ ఉదయశ్రీ)
ఆత్మహత్య.. ఆత్మహత్య.. ఈ ఆత్మహత్యలు పెరిగి పోయాయి.. కారణాలు ఏవైనా చాలా మంది విలువైన జీవితానికి ఆత్మహత్యతో ముగిస్తున్నారు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉంది. అయినా.. చిన్న, పెద్ద తేడా లేకుండా ఆత్మహత్య శరణ్యం అంటూ ప్రాణాలు తీసుకునే వారి సంఖ్య పెరిగి పోతుంది. ఇగో… కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యపై అనేన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆమె చావుకు కారణం ఇదేనా..?
హైదరాబాద్ నగరం అల్వాల్ పంచశీలలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రూపాదేవి మరణంపై అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. గత మూడేళ్లుగా ఆనారోగ్యంతో బాధ పడుతున్న రూపాదేవి ఆత్మహత్య చేసుకుందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే.. ఎమ్మెల్యేగా గెలిచిన సత్యం తన భార్య రూపాదేవి ఆనారోగ్యంను పట్టించుకోలేని పరిస్థితులు ఏమిటని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యేకు ఆర్థిక సమస్యలా..?
ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న రూపాదేవి ఆత్మహత్య చేసుకోవడానికి అసలైన కారణాలు తెలియక పోవచ్చానే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆర్థిక సమస్యలతో ఆమె ఆత్మహత్య చేసుకుందనే మరో వాదన తెరపైకి వచ్చింది. అయితే.. కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్యేగా గెలిచిన భర్త సత్యం ఉండగా ఆర్థిక సమస్యలతో రూపాదేవి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయినా.. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే సత్యం ఆర్థిక సమస్యలను అధిగమించే నేర్పు ఉంది. అలాంటి పరిస్థితులలో రూపాదేవి మరణంకు ఆర్థిక సమస్యలు కావానే నిజాన్ని చెబుతున్నారు.
కుటుంబ కలహాలా..?
ఎమ్మెల్యే సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణం కావచ్చనే టాక్ వినిపిస్తోంది. గత కొంత కాలంగా కుటుంబంలో ఏర్పడిన మనస్పర్థాలతో బాధ పడుతున్న రూపాదేవి ఆత్మహత్య చేసుకుందనే వదంతులు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పోలీసులు మాత్రం రూపాదేవి ఆత్మహత్యకు ఆనారోగ్యం కారణమంటూ కేసుకు ముగింపు చెప్పారు.
పిల్లలను పట్టుకుని బోరున విలపించిన ఎమ్మెల్యే
ఔను.. చొప్పదండి ఎమ్మెల్యే సత్యం బోరున ఏడిచారు. అతని భార్య రూపాదేవి గురువారం రాత్రి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇంట్లో పిల్లలు, తల్లి మాత్రమే ఉన్నారు. చొప్పదండి నియోజక వర్గంలో అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొంటున్న తన భర్త, ఎమ్మెల్యే సత్యంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే… ఆనారోగ్యంతో బాధగా ఉందని రూపాదేవి తన భర్తకు చెప్పి ఫోన్ కట్ చేసినట్లు తెలుస్తోంది. రాత్రి 10 గంటలకు బెడ్ రూమ్ లోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరిపెట్టుకుని మరణించింది.