అన్యాయాన్ని నిలదీసే మీసమున్న ముదిరాజ్ బిడ్డలు లేరా..?

ఓట్లు మావి… సీట్లు మీవా..?

నిలదీసే ముదిరాజ్ బిడ్డలు లేరా..?

అగ్రవర్ణాలకు 58.. బీసీలకు 23.. ఎస్సీలకు 20.. ఎస్టీలకు 12..

మెజార్టీగా ఉన్న ముదిరాజ్ కులస్థులకు గుండు సున్న..

బండ ప్రకాష్ – పిట్టల రవీంధర్ అధికార పార్టీలో పేలని తుపాకులా..?

ముదిరాజ్ ముద్దు బిడ్డలు.. పౌరుషంలో రాజు బిడ్డలు.. ఆత్మగౌరవంతో బతికే పులి బిడ్డలు.. ఇగో ఇలా మన ముదిరాజ్ లపై ప్రేమ నటిస్తూ పొలిటికల్ లీడరు లు పిలిసే పేర్లు.. మీసం వెలివేసి రోషంతో మాట్లాడే మన ముదిరాజ్ బిడ్డలు బండ ప్రకాష్ – పిట్టల రవీంధర్ అధికార పార్టీలో పేలని తుపాకులయ్యారా…?

రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పాలకులకు ముదిరాజ్ ముద్దు బిడ్డలు ‘‘ఎస్.. బాంచెన్..’’ అంటూ బానిసలుగా మారారు.. అందుకే అధికార బీఆర్ఎస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ముదిరాజ్ బిడ్డలకు టిక్కెట్లు ఇవ్వకుండా మొండి చెయ్యి చూపింది.
ఔను.. మీరు చదివింది అక్షరాల నిజం..

అధికార బీఆర్ఎస్ పార్టీ యాభై లక్షలు జనాభ ఉన్న ముదిరాజ్ ముద్దు బిడ్డలకు ఒక్క సీట్ కూడా ఇవ్వకుండా అవమాన పరిచింది. ఐదు శాతం లేని అగ్రవర్ణాలకు 58 సీట్లు ఇస్తే అందులో రెడ్డిలకు 38, వెల్మ (ముఖ్యమంత్రి కులం) లకు 11 సీట్లు ఇచ్చారు. అలాగే కమ్మలకు 5 సీట్లు, బ్రహ్మణులకు ఒకటి, వైశ్యులకు ఒక్కటి ఇచ్చారు.
అలాగే బీసీలకు 23 సీట్లు కెటాయించారు. అందులో మున్నూరు కాపు 11, గౌడ 4, యాదవ 5, ఎస్సీలకు 20 సీట్లు ఇస్తే అందులో మాదిగలకు 12, మాలలకు 8, బెస్తా, పద్మశాలి, వంజరి, నేతకాని కులస్థులకు ఒక్కో సీటు ఇచ్చారు. అలాగే ఎస్టీలకు 12 సీట్లు ఇస్తే అందులో లంబాడాలకు 7, ఆదివాసులకు 5 సీట్లు ప్రకటించారు.

ముదిరాజ్ లకు ఒక్క సీట్ కూడా ఇవ్వలే…

ముదిరాజ్ లు కాగితపు పులులే అనే భావనతో ఓట్ల కోసం ఉపయోగించుకోవడానికి అధికార పార్టీ వ్యూహంలో ప్రజాప్రతినిధులుగా వెలుగుతున్న బండ ప్రకాష్ – పిట్టల రవీంధర్ నోరు మెదుపడం లేదు. ఐదు శాతం లేని అగ్రవర్ణాలకు 58 మెజార్టీ సీట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముదిరాజ్ లకు ఒక్క సీట్ కూడా ఇవ్వక పోయినా ముదిరాజ్ ల పేరుతో పదవులు పొందిన ఈ ఇద్దరి నోరు మూగ పోవడానికి పదవులపై ఆశనే కావచ్చనేది టాక్.

ముదిరాజ్ లు ఓటు బ్యాంకెనా..?

ముదిరాజ్ ల ఐక్యత లోపం కొట్టొచ్చినట్లు కనిపించడంతో అధికార పార్టీ ముదిరాజ్ లను ఓట్ల బ్యాంక్ లుగా భావిస్తోంది. పదవుల కంటే ముదిరాజ్ ల ఆత్మస్థైర్యం ముఖ్యం అనే ధైర్యం చేసే నాథుడే లేకుండా పోయారు. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ బండ ప్రకాష్- పిట్టల రవీంధర్ లు కూడా సీఎం కేసీఆర్ తమ ముదిరాజ్ లకు సీట్లు ఇవ్వక అన్యాయం చేస్తున్నారని నిలదీసే దమ్ము వారికి లేక పోవడానికి ఉన్న పదవులు ఊడుతాయనే భయం వారిలో ఉంది.

బీసీలకు 70 శాతం ఇస్తానని ప్రకటించిన బిఎస్ పి

ముదిరాజ్ సంఘాలు ఎన్ని ఉన్నా…

ఉపయోగం సున్నా.. ? ఆలోచించండి…

కులాల వారిగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సీట్లు ఇవే..

కాంగ్రెస్ – బీజేపీ – టీడీపీ..
రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీసీలకు 70 శాతం ఇస్తామని భరోసా ఇచ్చిన పార్టీ బహుజన సమాజ్ పార్టీ. మెజార్టీ ప్రజలు ఉన్న బహుజనులకు రాజ్యాధికారం రావాలని బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశాడు. అయితే… అధికార బీఆర్ఎస్ మాత్రం బీసీలకు అన్యాయం చేసి అగ్రవర్ణాలకు ప్రధాన్యత ఇచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర కోట్ల జనాభ ఉంటే 50 లక్షలకు పైగానే ముదిరాజ్ బిడ్డలున్నట్లు గణాంక వివరాలు పేర్కొంటున్నాయి. అయినా.. పొలిటికల్ పార్టీలు ముదిరాజ్ లకు అన్యాయం చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ ముదిరాజ్ లకు మొండి చెయ్యి చూపినట్లు గానే కాంగ్రెస్ – బీజేపీ – టీడీపీ లు ముదిరాజ్ లకు సీట్ల విషయంలో న్యాయం చేస్తారో లేదో అనే సందేహం వ్యక్తం అవుతుంది. బీజేపీలో ఈటెల రాజేంధర్, టీడీపీలో కాసాని జ్ఞానేశ్వర్ కీలకమైన పదవులలో ఉన్నారు. అయినా.. టిక్కెట్లు ఇచ్చే విషయంలో ఎవరికి వారే చూసుకుంటారా..? లేక ముదిరాజ్ జాతీ బిడ్డలకు టిక్కెట్లు ఇస్తారో నిరిక్షించాల్సిందే..

ఇప్పటికైనా ముదిరాజ్ సోదరులు ఐక్యంగా పోరాడితే పాలకులు తలవంచి తీరాల్సిందే.. మరి.. ఇప్పుడు ఆలోచన చేయాల్సింది పౌరుషం గల ముదిరాజ్ బిడ్డలే..

  • యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్
Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!