Take a fresh look at your lifestyle.

తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్ రైలు

0 85

8న మరో వందేభారత్ రైలును

ప్రారంభించనున్న ప్రధాని నరేంద్రమోదీ

సికింద్రాబాద్, ఏప్రిల్ 1 (వైడ్ న్యూస్) ఈ నెల 8 వ తేదీన తెలంగాణ రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుగు రాష్ట్రాల మధ్యన సేవలందించనున్న 2 వ వందేభారత్ రైలును ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నందు జరగనున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, సికింద్రాబాద్ – తిరుపతి మధ్యన ఈ రైలు తన సేవలనందించనున్నట్లు తెలిపారు.

భాగ్యనగరం హైదరాబాద్, ఆధ్యాత్మిక నగరం తిరుపతికి మధ్యన ప్రయాణించే వారికి అనుకూలంగా ఈ రైలు తన సేవలను అందించనుందని, భాగ్యనగర వాసులకు ఈ అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కిషన్ రెడ్డి అన్నారు. ప్రారంభోత్సవం రోజున మేక్ ఇన్ ఇండియా వందేభారత్ రైలు ఆగనున్న అన్ని స్టేషన్లలో స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం తెలపాలని కిషన్ రెడ్డి కోరారు.

అత్యధిక సామర్థ్యంతో, ప్రయాణికులకు అద్భుతమైన ప్రయాణ అనుభాతిని కలిగించేలా 400 వందేభారత్ రైళ్లను తయారు చేయాలని ప్రకటించిన భారతీయ రైల్వే, అధునాతనమైన కోచ్ లతో, వేగవంతమైన సేవలను, ప్రయాణ అనుభూతిని ప్రయాణికులకు అందించాలన్న లక్ష్యంతో ఈ రైళ్లను ప్రారంభించడం జరుగుతోంది.

అత్యంత వేగంగా వేగాన్ని అందిపుచ్చుకోవడం, రాబోయే స్టేషన్ల సమాచార ప్రకటన, GPS వ్యవస్థతో కూడిన ప్రయాణికుల వివరాలు, ఆటోమేటిక్ గా తెరుచుకునే తలుపులు, ముడుచుకునే మెట్లు, బయో టాయిలెట్లు వంటి అధునాతన సదుపాయాలతో పాటు కవచ్ వంటి ఆధునిక భద్రతా సౌకర్యాలను ప్రయాణికుల సౌకర్యార్థం ఈ వందేభారత్ రైళ్లలో కల్పించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking