సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా అమృత

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా అమృత

హైదరాబాద్, నిర్దేశం:
ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది. 2018లో జరిగిన ఈ హత్యకు సంబంధించి మొత్తం 8 మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. ఏ1 అయిన అమృత తండ్రి మారుతి రావు విచారణ జరుగుతుండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా ఏడుగురిలో ఏ2, హంతకుడు సుభాష్ శర్మకు ఉరిశిక్ష పడింది. అమృత బాబాయ్ శ్రవణ్ సహా ఇతర దోషులకు జీవిత ఖైదు విధిస్తూ  నల్లగొండ జిల్లా రెండవ అదనపు సెషన్స్, ఎస్సీ ఎస్టీ కోర్డు తీర్పు వెల్లడించింది. ఈ కేసు తీర్పుపై ప్రణయ్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.ప్రణయ్ హత్య కేసు తీర్పు వెలువడిన నేపథ్యంలో అమృత మరోసారి వార్తలోకి వచ్చింది. ఇంతకీ ఆమె ఏం చేస్తుంది? ఎక్కడ ఉంటుంది? అనే అంశాల మీద నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ప్రణయ్ హత్య సమయంలోనే ఆమె ప్రెగ్నెంట్. పరీక్షల కోసం అమృతను హాస్పిటల్ కు తీసుకెళ్తుండగానే దుండగులు అతడిని హత్య చేశారు. అప్పుడు ఆమె 5 నెలల గర్భవతి. ఆ తర్వాత ఆమెకు ఓ బాబు పుట్టాడు. కొంతకాలం తర్వాత ఆమె అత్తామామల ఇంట్లోనే ఉన్నది.

                               కొద్ది నెలల తర్వాత ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో మళ్లీ తన తల్లికి దగ్గర అయ్యింది.కొంతకాలం తర్వాత అమృత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ గా మారింది. పలు రకాల బ్రాండ్లను సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రమోట్ చేస్తున్నది. తన ఛానెల్ లో వ్యక్తిగత జీవితం, కొడుకుతో  గడిపే క్షణాలుతో పాటు లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రంగాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నది. ఇన్ స్టా, ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఛానెల్ ద్వారా అనేక విషయాలను పంచుకుంటున్నది. ప్రస్తుతం అమృత కొడుక్కు సుమారు 6 ఏళ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె తన తల్లితో కలిసి హైదరాబాద్ లోనే ఉంటుంది. అప్పుడప్పుడు మిర్యాలగూడకు వెళ్లి వస్తుంటారు. ఇందుకు సంబంధిచిన వీడియోలను అమృత సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంది. ఇప్పుడిప్పుడే ప్రణయ్ హత్యకు సంబంధించిన చేదు జ్ఞాపకాలను ఆమె మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నది. తన కొడుకుతో కలిసి సంతోషంగా జీవిస్తోంది.అమృతతో ప్రణయ్ కి స్కూల్ డేస్ నుంచే పరిచయం ఉంది. చిన్నప్పటి నుంచే స్నేహితులు. ఆ తర్వాత నెమ్మదిగా ఒకరిపై మరొకరికి ఇష్టం ఏర్పడింది. ఇద్దరూ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుంటామని అమృత ఇంట్లో అడిగితే, ఆమె తండ్రి మారుతిరావు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో జనవరి 31, 2018లో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రణయ్‌ మాల కులానికి చెందిన అబ్బాయి కాగా, అమృతది వైశ్య సామాజిక వర్గం. అమృత తండ్రి రియల్ ఎస్టేట్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తనను కాదని పెళ్లి చేసుకున్నారనే కోపంతో మారుతిరావు కిరాయి హంతకులతో ప్రణయ్ ని హత్య చేయించాడు. ఈ కేసులో మారుతీరావును ఏ1గా చేర్చగా అతడి తమ్ముడు శ్రవణ్ ను ఏ6గా పేర్కొన్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు వెల్లడైంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »