అమరావతి బాధ్యత ఆర్కే కే !
విజయవాడ, నిర్దేశం:
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని నిలిపివేశారు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అయితే ఈ విషయంలో ముందడుగు వేయలేకపోయారు. అమరావతిని నిర్వీర్యం చేశారని విమర్శను మూటగట్టుకున్నారు. ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో.. ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డికి అంతు పట్టడం లేదు. ఇటువంటి సమయంలో ఓ కీలక నేత సాయం తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.అమరావతివిషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపై వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి మల్లగుల్లాలు పడుతున్నారు. తాను వ్యతిరేకించిన అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి ఎదురైన పెద్ద దెబ్బ. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని నిలిపివేశారు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అయితే ఈ విషయంలో ముందడుగు వేయలేకపోయారు. అమరావతిని నిర్వీర్యం చేశారని విమర్శను మూటగట్టుకున్నారు. ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో.. ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డికి అంతు పట్టడం లేదు. ఇటువంటి సమయంలో ఓ కీలక నేత సాయం తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సైతం సమ్మతించారు. తాను వ్యతిరేకించినా అమరావతి రాజధానిగా ఎంపిక ఆగదని అంచనాకు వచ్చారు. అమరావతిని వ్యతిరేకిస్తే రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని జగన్ మోహన్ రెడ్డికి తెలుసు.
అందుకే ఆ సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే గా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి సేవలను వినియోగించుకున్నారు. అమరావతికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు రైతులు. కానీ అక్కడక్కడ కొంతమంది రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అటువంటి వారిని కూడా తీసుకొని ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయించేవారు. కోర్టు నుంచి వ్యతిరేక తీర్పులు వచ్చేవి. దీంతో దానిపై విస్తృతంగా ప్రచారం చేసేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. సోషల్ మీడియా వేదికగా విషం ప్రయత్నం చేసేది. అప్పట్లో ఇది రాజకీయంగా బాగా వర్కవుట్ అయ్యింది. అందుకే మరోసారి అదే ఫార్ములాను అనుసరించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.మొన్నటి ఎన్నికల్లో మంగళగిరినుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించారు జగన్మోహన్ రెడ్డి. బీసీ ప్రయోగం చేస్తూ కాండ్రు కమల అనే మహిళ నేతకు టికెట్ ఇచ్చారు. కానీ నారా లోకేష్ 90 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. కొద్ది రోజులకే తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం చేశారు కానీ.. వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. అయితే ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభమైన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కొత్త నిర్ణయం తీసుకున్నారు. తిరిగి ఆళ్ల రామకృష్ణారెడ్డికి వైయస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్న జగన్ ప్రకటనకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ల పై విమర్శలు చేస్తున్నారు. అమరావతి నిర్మాణాన్ని ఆపలేకుండా పార్లమెంట్లో చట్టం చేయనున్నారు. అది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. అందుకే అమరావతి నిర్మాణంలో అవినీతి, వైఫల్యాలను బయటకు తీసే బాధ్యతను ఆళ్ల రామకృష్ణారెడ్డికిజగన్ అప్పగించినట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించి.. అమరావతి పై ఫుల్ ఫోకస్ పెట్టే బాధ్యతను ఆళ్ల రామకృష్ణారెడ్డికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి అవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏర్పడింది. అందుకే పిలిచి మరి బాధ్యతలు కట్టబెడుతున్నారు.