మహిళల భద్రత, రక్షణలకు పెద్దపీట- జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS

61 దిశ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాలు, దిశ మినీ వ్యాన్ , 2 క్విక్ రెస్పాన్స్ వాహనాల ప్రారంభం

జిల్లాలో మహిళల భద్రత/ రక్షణకు ప్రభుత్వం, పోలీసుశాఖలు పెద్దపీట వేశాయని జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారు అభిప్రాయపడ్డారు. అమ్మాయిల/మహిళల భద్రతతో పాటు వారిపై జరిగే నేరాలు అరికట్టేందుకు పంపిణీ చేసిన 61 ద్విచక్ర వాహనాలు, దిశ మినీ వ్యాన్ , 2 క్విక్ రెస్పాన్స్ వాహనాలను ఆయన గురువారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాల్ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం దిశ ప్రోగ్రాంను తీసుకొచ్చి పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో ప్రతీ జిల్లాకు దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఒక డిఎస్పి మరియు సిబ్బందిని కేటాయించి సేవలు అందిస్తున్నారన్నారు. అంతేకాకుండా ఆపదలో ఉన్న మహిళల రక్షణకు పోలీసు వారి సపోర్ట్ తొందరగా లభించేలా దిశ అప్లికేషన్ను ప్రవేశపెట్టిందన్నారు. ఈ అప్లికేషన్ పట్ల విస్తృతంగా అవగాహన చేస్తున్నారని గుర్తు చేశారు. దీంతో పాటు జిల్లాలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్లలో ఉమెన్ హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశామన్నారు. మహిళలపై జరిగే నేరాలను అత్యంత ప్రాధాన్యత గా పరిగణించాం. త్వరితగతిన పరిష్కారం చూపడంలో భాగంగా దర్యాప్తును వేగవంతం చేయడం, నిర్ణీత వ్యవధిలోనే ఛార్జిషీట్లు దాఖలు చేసి బాధితులకు న్యాయం… నిందితులకు శిక్షపడేలా కృషి చేయడం జరుగుతోందన్నావు. వీటితో పాటు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టి అమ్మాయిలు/మహిళల్లో ఎటువంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా తిరిగేలా ప్రభుత్వం భరోసా కల్పిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. దిశ పోలీస్ స్టేషన్ కు మినీ వ్యాన్ ను మరియు ప్రతి పోలీసు స్టేషన్ కు దిశ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాన్ని కేటాయించామన్నారు. జిల్లాలో ప్రాధాన్యతగా 61 పోలీసు స్టేషన్లకు ద్విచక్ర వాహనాలను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. మహిళా నేరాలు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల స్టేషన్లకు ఈ వాహనాలను ప్రాధాన్యతగా కేటాయిస్తున్నాం. ఈ వాహనాల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయన్నారు. నేరం జరిగాక ఘటనా స్థలానికి కానిస్టేబుల్ నుంచి అధికారుల వరకు వెళ్లి పరిశీలించాల్సి ఉంటుంది. వారి వారి విధులు సక్రమంగా, పకడ్బంధీగా నిర్వహించేలా అందరూ ఒక బృందంగా ఘటనా స్థలానికి మినీ వ్యాన్ లో వెళ్లనున్నారు. త్వరితగతిన కేసు దర్యాప్తు పూర్తీ చేయడం కోసం బాధితురాలి ఇంటి వద్ధకే వెళ్లి ఆమె ఐడెంటిటీ బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం… ఘటనా స్థలంలోని ఆధారాలను సమగ్రంగా సేకరించి భద్రపరిచేందుకు ప్రత్యేక కిట్స్ ఈ మినీ వ్యాన్ లో ఉంటాయన్నారు. దిశ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాల వల్ల మహిళల భద్రతకు భరోసా కల్పించనున్నాము. ఈవ్ టీజింగ్ , వేధింపులు నియంత్రించేలా ఈ వాహనాల్లో సంచరించడం…. విద్యాసంస్థలు, దేవాలయాలు, శివారు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా వేయడం మరియు మహిళా నేరాలు జరుగకుండా ముందస్తు కట్టడి చర్యలు చేపట్ఠేందుకు వీలవుతుందన్నారు.
ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎస్ వెంకటరావు, జె రామమోహనరావు, రామకృష్ణప్రసాద్ , హనుమంతు… డీఎస్పీలు ఉమామహేశ్వరరెడ్డి, వీరరాఘవరెడ్డి, ప్రసాదరెడ్డి, మురళీధర్ ,ప్రసాదరావు, ఆర్ ఐ లు పెద్దయ్య, టైటస్ , శ్రీశైలరెడ్డి, నారాయణ, శివరాముడు, పెద్దన్న, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ , సుధాకర్ రెడ్డి, తేజ్ పాల్ , పలువురు ఆర్ ఎస్ ఐలు,తదితరులు పాల్గొన్నారు.

 

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!