పాక్ ట్రైన్ హైజాక్..
27 మంది రెబెల్స్ హతం.. 150 మంది సురక్షితం
న్యూ డిల్లీ, నిర్దేశం:
పాకిస్థాన్‌లో జరిగిన ట్రైన్ హైజాక్‌లో రెబెల్స్ నిర్భందించిన వారిలో 150 మందిని మిలిటరీ సిబ్బంది విడిపించారు. మంగళవారం 400 మంబలోచిస్థాన్:దితో క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కి వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేశారు. ట్రైన్ ట్రాక్‌ను పేల్చేసిన ఉగ్రవాదులు ఆ తర్వాత కాల్పులు జరిపారు ఈ దాడిలో 6 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడి తామే చేయించినట్లు బలోచిస్థాన్ లిబరల్ ఆర్మీ ప్రకటించింది. పాక్ మిలిటరీ ప్రతి దాడికి దిగింది. మంగళవారం రాత్రి మొత్తం ఉగ్రవాదులపై కాల్పులు జరపగా.. 27 మంది రెబెల్స్ మృతి చెందినట్లు తెలిపారు. అయితే తమ మనుషులు ఎవరూ మృతి చెందలేదని.. తామే 30 మంది సైనికులను చంపామని బలోచిస్థాన్ లిబరల్ ఆర్మీ ప్రకటించింది.