అమ్మకానికి ఆదిలాబాద్ సిమెంట్ కంపెనీ

అమ్మకానికి అదిలాబాద్ సిమెంట్ కంపెనీ

అదిలాబాద్, నిర్దేశం:
ఆదిలాబాద్‌ జిల్లాలోని సిమెంట్ పరిశ్రమ పరికరాలు అమ్మేందుకు కేంద్రం టెండర్లు పిలించింది. దీన్ని వ్యతిరేకిస్తున్న స్థానికులు పునఃప్రారంభించాలని అభ్యర్థిస్తున్నారు.ఒకప్పుడు అది ఆదిలాబాద్ జిల్లా వాసులకు ఉపాధి కల్పించిన పరిశ్రమ. ఆ పరిశ్రమ ప్రారంభమైన కొన్నేళ్ళకే మూతపడింది. ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమను తుక్కులో అమ్మేస్తామంటున్న కేంద్రం- భగ్గుమంటున్న జనంఇంతకీ ఆ పరిశ్రమ మూత పడటానికి గల ప్రధాన కారణమేంటి..?

ఆదిలాబాద్ జిల్లాలో మూతపడ్డ సిమెంట్ పరిశ్రమ ఇది.

ఈ సిమెంట్ పరిశ్రమ (సీసీఐ) అదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 1977 లో శంకుస్థాపన జరిగింది. 1982లో అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి వెంగళరావ్ చేతుల మీదుగా ప్రారంభం అయింది. మొత్తం 772 ఎకరాల భూమిని స్థానిక రైతుల వద్ద ఎకరానికి 2 నుంచి 3 వేల రూపాయలకు ప్రభుత్వం కోనుగోలు చేసింది. ఇక్కడ 170 ఎకరాల టౌన్‌షిప్ నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. 48.18 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ నిల్వలు, సున్నపురాయి పుష్కలంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో 4000 మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు దక్కాయి. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఈ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమ్మకాలు చేసింది. ఈ సిమెంట్‌తో అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారు. అత్యంత నాణ్యత కలిగిన సిమెంటుగా పేరొచ్చింది. సిమెంట్ పరిశ్రమ కొన్నేళ్లపాటు బాగే నడిచి..తర్వాత వచ్చిన నష్టాలు కారణంగా 1995లో మూతపడింది. అప్పటి నుంచి ఎంతో మంది ఈ సిమెంటు పరిశ్రమను పునః ప్రారంభించాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ అది జరగలేదు. అలా పరిశ్రమ మొత్తం మూత పడటంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయారు.

ఎన్నికల వేళ ఆనేక సందర్భాల్లో ఈ సీసీఐ అంశం తెరపైకి వచ్చింది.

ఎంతోమంది ప్రజాప్రతినిధులు తమ ప్రభుత్వం వస్తే పునః ప్రారంభిస్తామని హామీలు ఇచ్చారు. 2018లో కేంద్రమంత్రి అమిత్ షా ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం మళ్ళీ వస్తే సీసిఐని పునః ప్రారంభిస్తామన్నారు. అయినా దాని ఊసే లేదు. 2023 ఎన్నికల్లో కూడా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం కోసం ఆదిలాబాద్‌ వచ్చారు. దాని ప్రస్తావనే తీసుకురాలేదు. దీంతో చాలా మంది నిరాశ చెందారు. అయినా కూడా ప్రజలు అదిలాబాద్‌లో ఎమ్మెల్యే ఎంపి రెండు సీట్లు బీజేపీకే పట్టం కట్టారు. మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) పరిశ్రమను పునరుద్ధరించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. ఆ సంస్థ ఆస్తులను విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. కేంద్రం ఇటీవల యూనిట్ స్క్రాప్, పరికరాలు విక్రయించడానికి టెండర్లు ఆహ్వానించింది.

దీని ప్రారంభ ధర రూ. 43.30 కోట్లుగా నిర్ణయించారు. ఈ నిర్ణయంపై ప్రజలు. ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇటీవల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ సైతం తన X ఖాతాలో ట్వీట్ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. బిజేపీ స్థానిక ప్రజాప్రతినిధులు సైతం సీసీఐ ఆస్తులను వేలం వేయకుండా నిరోధించడంలో విఫలమయ్యారని, ఎన్నికల హామీని నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేలేదని స్థానిక ప్రజలు కార్మిక సంఘాల నాయకులు వాపోతున్నారుయ సీసీఐని పునరుద్ధరించకపోతే భూమిని కేంద్రం రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 1970ల్లో రైతులు నామమాత్రపు ధరలకు భూములు ఇచ్చారన్నారు.

భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు భూముల ధరలు విపరీతంగా పెరిగినందున వారి భూములను తిరిగి ఇస్తే న్యాయం జరుగుతుందన్నారు. లేదంటే సీసీఐని పునః ప్రారంభించి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల అభిప్రాయం ప్రకారం, సీసీఐ సిమెంట్ పరిశ్రమ గురించీ ప్లాంట్‌కు సొంత భూమి ఉంది. సిమెంట్ ఉత్పత్తికి ముడి పదార్థం, సున్నపురాయి సరిపడ ఉంది. అందుకే పరిశ్రమను పునః ప్రారంభించి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. జిల్లాను అభివృద్ది పథంలో నడిపేందుకు కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »