సాంగ్లీ మార్కెట్ ధరలకే రైతుల పసుపు కొనుగోలు చేయాలి.
– ఏ.ఐ.యూ.కే.ఎస్. రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి. ప్రభాకర్.
నిర్దేశం, నిజామాబాద్ :
సాంగ్లీ మార్కెట్ లో ఉన్న ధరల ప్రకారంగా నిజామాబాద్ రైతుల పసుపు ను కొనుగోలు చేయాలని, సిండికేట్ గా మారిన పసుపు కొనుగోలు దారులపై చర్యలు తీసుకోవాలని ఏ.ఐ.యూ.కే.ఎస్. రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి. ప్రభాకర్. డిమాండ్ చేశారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ లో పసుపుకు ధరలు రాకుండా కొనుగోలు దారులు సిండికేట్ గా మారి పసుపు రైతులని నిండా మంచుతున్నారని ఆయన ఆరోపించారు. సాంగ్లీ మార్కెట్లో పదిహేను వేల ధర ఉన్న పసుపు నిజామాబాద్ మార్కెట్లో ఎనిమిది తొమ్మిది, వేలు కూడా పలకడం లేదన్నారు. పసుపు పంట తొమ్మిది నెలలకు వస్తుందని, పెట్టుబడి 1,70,000 సుమారుగా అవుతుందని అయినా రైతుకు ప్రస్తుతం నిజాంబాద్ మార్కెట్ లో ఏమాత్రం ధరలు లేక చేతి ఖర్చులు కూడా వెళ్లడం గగనమైన అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశించిన వ్యవసాయ మార్కెట్ అధికారుల్లో చలనం లేదన్నారు. సిండికేట్ వ్యాపారులకు ఇలాంటి భయం లేకపోవడం వల్ల పసుపు రైతుల్ని అన్ని విధాలుగా దోపిడీ చేస్తున్నారని అన్నారు. పసుపుకు మార్కెట్లో మధు ధర 15వేలు ఇవ్వాలి అని, ప్రభుత్వం పసుపు క్వింటల్ కు వేయి బోనస్ ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు మంథని గంగారం(పిట్టే), జక్కా. లింగారెడ్డి,స్వామి యాదవ్ సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, జిల్లా నాయకులు బి. దేవారం, ఎస్. సురేష్, జీ. కిషన్, డివిజన్, మండల నాయకులు ఆర్. దామోదర్, బి.బాబన్న, బి. కిషన్, జి.సాయిరెడ్డి, బి. కిశోర్, ఎం. డి. అనిస్, పుట్టి. నాగన్న, టి. కృష్ణ గౌడ్. తదితరులు పాల్గొన్నారు.