శ్రీచైతన్య కాలేజీల్లో కొనసాగుతున్న దాడులు

శ్రీచైతన్య కాలేజీల్లో కొనసాగుతున్న దాడులు

5కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు

హైదరాబాద్‌, నిర్దేశం:

శ్రీచైతన్య కాలేజీల్లో ఐటీ సోదాలు వరుసగా రెండోరోజూ కొనసాగాయి. మాదాపూర్‌లోని ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు రూ.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎపి, తెలంగాణతో పాటు 10 ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. అడ్మిషన్లు, ట్యూషన్‌ ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. లావాదేవీల సాప్ట్‌వేర్‌ను ఐటీ అధికారులు పరిశీలించారు. శ్రీచైతన్య కాలేజీల ట్యాక్స్‌ చెల్లింపులపై ఐటీ ఆరా తీస్తోంది. 2020లోనూ శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. గతంలోనూ రూ.11 కోట్లు స్వాధీనం చేసుకున్నవిషయం విదితమే. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తూ పన్నులు చెల్లించకుండా ఎగవేస్తున్నారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరు, ముంబై సహా పలు ప్రాంతాల్లోని శ్రీ చైతన్య విద్యాసంస్థల కార్పొరేట్‌ కార్యాలయాలపై ఒక్కసారిగా దాడులు చేపట్టారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ రషీదులు ఇవ్వకుండా పెద్దఎత్తున ట్యాక్స్‌ ఎగ్గొడుతున్నట్లు సోదాల్లో అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ముందుగా హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అధికారులు అక్రమ లావాదేవీలు గుర్తించినట్లు సమాచారం. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య కార్పొరేట్‌ కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ సోదాల్లోనూ పెద్దమొత్తంలో అక్రమ లావాదేవీలు గుర్తించినట్లు తెలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నేరుగా నగదు తీసుకునేందుకు ఒక సాప్ట్వేర్‌.. అలాగే ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్‌ కోసం మరో సాప్ట్వేర్‌ ఏర్పాటు చేసుకున్నట్లు ఐటీ అధికారులు నిర్దారించారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »