ముస్లిం మహిళను పారతో కొట్టి హత్య
అడ్డుకోబోయిన భర్తపై దాడి
గజ్వేల్, నిర్దేశం:
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ పెట్రోల్ బంక్ వద్ద ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వివాహిత అశ్ర (45) పై మహారాష్ట్రకు చెందిన అస్రం(48 సోమవారం తెల్లవారుజామున పారతో గాయపరిచి హత్యచేసి పరారైనాడు. భార్య అరుపులకు వచ్చి అడ్డుకోబోయిన భర్త సదాత్ (50)పై కూడా దాడిచేసి గాయపరిచాడు దుండగుడు. బాధితులు ఇదివరకు హైదారాబాద్ లో జీవనాధారం కోసం వచ్చి నివాసమున్నప్పుడు హత్యచేసిన అస్రంతో సదాత్ కుటుంబానికి పరిచయం ఉండేది. కాగా గత కొంత కాలంగా రిమ్మనగూడ పెట్రోల్ బంక్ లో వాచ్మెన్ పని చేస్తూ ఓ రూంలో భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి రిమ్మనగూడలోని వీరి నివాసానికి వచ్చిన దుండగుడు అస్రం , రాత్రి వేళ వీరితోనే బసచేసి తెల్లవారుజామున 6 గంటల సమయంలో అశ్రను పారతో కొట్టి హత్య చేసాడు. అడ్డుకోబోయిన భర్తను గాయపరిచి పరారైయాడని భర్త తెలిపాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.