కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
మంథని ప్రతినిధి, నిర్దేశం :
మంథని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలు శివ, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్రి రమ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలల అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని వాటిని ఉపయోగించుకొని మహిళలు మరింత ముందుకు సాగాలని వారన్నారు. మహిళలను కోటీశ్వరాలను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని వారు కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్,గృహ జ్యోతి, ఇందిరా మహిళా శక్తి ద్వారా అనేక పథకాలను ప్రవేశపెడుతూ మహిళల అభ్యున్నతి కోసం పాటుపడుతుందని వారు అన్నారు. మహిళలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ లోన్ల ద్వారా చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించుకుని మరింత ముందుకు వెళ్లాలని తద్వారా పదిమందికి ఉపాధి కల్పిస్తూ ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు,మాజీ ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.