మహిళా ఆటో డ్రైవర్, మహిళా గాయని కి ఘనంగా సన్మానం

మహిళా ఆటో డ్రైవర్, మహిళా గాయని కి ఘనంగా సన్మానం

మహిళలు రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలి.

కరీంనగర్, నిర్దేశం :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ డిసిసి కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర సత్య ప్రసన్న రెడ్డి ఆధ్వర్యంలో  సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కేకును కర్ర సత్య ప్రసన్నా రెడ్డి  కట్ చేసి మహిళా కాంగ్రెస్ శ్రేణులకు అందించి ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సత్య ప్రసన్నా రెడ్డి  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పాలనలో మొట్టమొదటిగా మహిళల సంక్షేమమే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరిన నెల రోజుల్లో ప్రవేశపెట్టిన ఉచిత బస్సుతో చాలామంది మహిళలు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు, దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 1200 రూపాయలు ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకే అందజేసి మధ్యతరగతి మహిళల కుటుంబాలలో ఆనందాన్ని నింపినారు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తుతో చిన్న చిన్న పరిశ్రమలు నడుపుకునే మహిళలు లాభాలు గడిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు, ప్రధానంగా నేడు మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పేరుతో 150 బస్సులను మహిళల ద్వారా నడిపించాలని నిర్ణయం హర్షించదగ్గ విషయం దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మహిళా కాంగ్రెస్ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు అంతరిక్షంలో అడుగు పెట్టే స్థాయికి ఎదిగినారు, రాజకీయ రంగంలో మహిళలు అత్యున్నత స్థాయికి ఎదగాలి ఇంకా రాజకీయ వేదికలలో మహిళలకు సముచిత స్థానం లభించడం లేదు, మహిళలు వివరి స్థానాన్ని వారు కాపాడుకోవడానికి శ్రమించాలి మహిళా చట్టాలను పటిష్టంగా అమలుపరిచే బాధ్యతలను చేపట్టే స్థాయికి మహిళలు చేరుకున్నప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానని అన్నారు. కార్యక్రమానంతరం భారత నారీశక్తి అంతర్జాతీయ అవార్డు గ్రహీత సింగర్ కృష్ణవేణి మహిళా ఆటో డ్రైవర్ శ్రీమతి.ఉమ దేవి శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు మండలాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »