ఆస్తి కోసం కన్నతల్లిని హతమార్చిన కసాయి కొడుకు
హైదరాబాద్, నిర్దేశం :
ఆస్తి కోసం ఒక కసాయి కొడుకు కన్నతల్లినే హతమార్చాడు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని డివినో విల్లాస్ లో ఘటన జరిగింది. కార్తిక్ రెడ్డి (26) మద్యానికి బానిసై ఆస్తి కోసం కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడేవాడు. తల్లి రాధిక (52)పై కత్తితో దాడి చేసి హత్య చేసాడు. నిందితుడు కార్తీక్ రెడ్డి పోలీసుల అదుపులో వున్నట్లు సమాచారం