హైదరాబాద్ లో రోజు రోజుకీ కొత్త మోసాలు
హైదరాబాద్, నిర్దేశం:
హైదరాబాద్ లో రోజు రోజుకీ కొత్త మోసాలు బయటపడుతున్నాయి. ఎవరూ అమాయకంగా కనిపిస్తారో వారిని ఇట్టే మోసం చేస్తారు. భాగ్యనగరంలో రకరకాల మోసాలు చూస్తుంటాం. ఆన్ లైన్ లో మోసాలు, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ పేరు వాడుకుని చాలా రకాలుగా ప్రజలను మోసం చేస్తుంటారు. తాజాగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్న వారిని మై ఫ్రూట్ బాక్స్ పేరుతో మోసం చేసిన ఘటన హైదరాబాద్, బోరబండలో చోటుచేసుకుంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కు వివిధ పండ్లను సప్లై చేస్తామని ఆన్ లైన్ లో ప్రమోషన్ కూడా చేయించారు. ఫ్రూట్ బౌల్ కు రూ.3000, మినీ ఫ్రూట్ బౌల్ కు రూ.1500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. డబ్బులచెల్లించిన తర్వాత ఫ్రూట్ డెలివరీ చేయకుండా ముఖం చాటేస్తున్నారు. ఇప్పటికే ఇలా చాలా మంది మోసపోయారు.కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదన్న కస్టమర్స్ లబోదిబోమంటున్నారు. ఆఫీస్ కు వెళ్లి అడిగితే కేసు పెడుతున్నారని కస్టమర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మై ఫ్రూట్ బాక్స్ వల్ల 1600 మందికి పైనే మోసపోయారని తెలుస్తోంది. మై ఫ్రూట్ బాక్స్ నడిపే వారిని కఠినంగా శిక్షించాలని కస్టమర్స్ అధికారులను వేడుకుంటున్నారు.బోరబండ, శ్రీనగర్ కాలనీలో ఓ కస్టమర్ మోసపోయాడు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లల్లో చూసి తాము ఆర్డర్ పెట్టామని వాపోయాడు. ఆర్డర్ పెట్టి వారం రోజులు అవుతుందని.. డబ్బులు చెల్లించే వరకు స్పందించారని.. చెల్లించాక వాళ్లు అందుబాటులో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ స్టాగ్రామ్ చూసి రూ.3000 డబ్బులు పే చేశానని మరో బాధితుడు వాపోయాడు. ఆ తర్వాత డబ్బులే చెల్లించలేదని.. కనీసం అందుబాటులో లేరని బాధిత వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. వారికి వందల సార్లు ఫోన్ చేశామని అయినప్పటికీ స్పందించలేదని వాపోయారు.