యూట్యూబ్ ఛానల్ ముసుగులో  స్పా సెంటర్ నిర్వహణ..?

యూట్యూబ్ ఛానల్ ముసుగులో  స్పా సెంటర్ నిర్వహణ..?

విజయవాడ, నిర్దేశం:
విజయవాడ వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్ లోని ఓ స్టూడియోపై పోలీసుల దాడి జరిగింది. పది మంది మహిళలు, 13 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. మహిళలంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు. చలసాని ప్రసన్న భార్గవ్ యూట్యూబ్ ఛానల్ ను అడ్డం పెట్టుకుని స్పా సెంటర్  నిర్వహిస్తున్నట్లు సమాచారం. భార్గవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు,. మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాచవరం  సీఐ ప్రకాష్  మాట్లాడుతూ వెటర్నరీ కాలనీలో స్టూడియో 9 పేరున స్పా ముసుగులో  వ్యభిచారం జరుగుతుంది. ఉత్తర భారత దేశమైన హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ నుంచి మహిళలను తీసుకువచ్చారు. ఆన్లైన్ ద్వారా విటులకు గ్యాలం వేస్తున్నారు. యూని సెక్స్ సెలూన్ పేరుతో క్రాస్ మసాజ్ లకు నిర్వహిస్తున్నారు. స్టూడియో 9 స్పా ఓనర్ చలసాని భార్గవ్ స్పాను నిర్వహిస్తున్నారని మేనేజర్ శ్యామ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సీసీ కెమెరాలు, హై సెక్యూరిటీ లాక్ డోర్లను స్పా సెంటర్ కు ఏర్పాటు చేసి పోలీసుల రాకను  ముందుగానే గమనిస్తున్నారు. గతంలో అనేకసార్లు వీరిని హెచ్చరించాం. విజయవాడ నగరంలో స్పా పేరుతో క్రాస్ మసాజులు చేసేవారిపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ కు కూడా చలసాని భార్గవ్ నిర్వహిస్తున్నట్లుగా సమాచారం ఉంది.. యూట్యూబ్ ఛానల్ ఉద్యోగులు ఎవరిని మేము అదుపులోకి తీసుకోలేదు విచారణ  చేయలేదు. చలసాని ప్రసన్న భార్గవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు త్వరలోనే అతనిని పట్టుకుంటామని అన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »