గ్రూప్ ఫలితాలు విడుదలకు అంతా సిద్ధం
హైదరాబాద్, నిర్దేశం:
తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. 783 ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షల కోసం ఎగ్జామ్‌ను డిసెంబ్ 15, 16 తేదీల్లో నిర్వహించింది. ఆ ఫలితాలను త్వరలోనే విడుదల చేయడానికి ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ పరీక్షల్లో విజయం సాధించేందుకు శక్తివంచన లేకుండా కష్టపడి చదివిన అభ్యర్థులు ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి త్వరలోనే టీజీపీఎస్సీ గుడ్ న్యూ చెప్పనుంది. ఎంఆర్వో, ఏఎస్వో, అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇలా కీలకమైన ఉద్యోగాల కోసం ప్రభుత్వం నోటిఫికేషనే వేసింది. 783 ఉద్యోగాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఉద్యోగాల కోసం 551,855 మంది అభ్యర్థులు రిజిస్టర్ అయ్యారు. వీరిలో 2,50,000 మంది కంటే ఎక్కువ మంది పరీక్ష రాశారు. 33 జిల్లాల్లో 1,368 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహించింది టీజీపీఎస్సీ. రెండు రోజుల పాటు నాలుగు పేపర్లు రాశారు అభ్యర్థులు. ఒక్కో పేపర్ 150 మార్కులు కలిగి ఉంది. 150 క్వశ్చన్స్ కూడా ఆబ్జెక్టివ్ టైపే. పరీక్ష రాసిన అభ్యర్థుల్లో మాత్రం టెన్షన్ కొనసాగుతోంది. హైయ్యెస్ట్ మార్కులు ఎంత ఉండొచ్చు… కటాఫ్ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. క్వశ్చన్ పేపర్‌ను బేస్ చేసుకొని గతంలో చేపట్టిన సెలక్షన్ ప్రక్రియను గమనిస్తే కటాఫ్‌పై అభ్యర్థులు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. ప్రశ్నల స్థాయిని బట్టి ఓ అంచనాకు వస్తున్నారు. ఆ మార్కుపలకు అటు ఇటుగా కటాఫ్ ఉండొచ్చని అంటున్నారు. జనరల్ అభ్యర్థుల కటాఫ్ మార్కులు 130 నుంచి 145 మధ్య ఉండొచ్చని ఓ అంచనా. ఓబీసీ అభ్యర్థుల కటాఫ్ 120-135 మార్కుల మధ్య ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కటాఫ్ 110-120 మార్కులు ఉండొచ్చని అంటున్నారు. దివ్యాంగుల కోటా అభ్యర్థులు 100-110 మార్క్స్ వరకు ఉంటుందని చర్చ జరుగుతోంది.
గ్రూప్ 2 రిజల్ట్స్ వస్తే ఎలా చూసుకోవాలి
గ్రూప్ 2 ఫలితాలను టీజీపీఎస్సీ తన వెబ్సైట్లోనే పెడుతుంది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అయితే సులభంగా ఫలితాలు చూసుకోవచ్చు.
ముందు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెస్‌సైట్ www.tspsc.gov.in ను సందర్శించాలి.
తర్వాత అందులో హోమ్‌పేజ్‌లో ఉండే రిజల్ట్స్ విభాగంపై వెళ్లాలి.
అందులో టీజీపీఎస్సీ గ్రూప్ II 2025 ఫలితాలు అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి.
అప్పుడు మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి.
అన్నీ కరెక్ట్‌గా టైప్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి.
ఈ ఫలితాలు వచ్చిన తర్వాత అభ్యర్థులను తర్వాత దశకు ఎంపిక చేస్తారు. కొన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ లేని ఉద్యోగాలకు ఎంపికైన వారికి సర్టఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఏ క్షణమైన గ్రూప్ 2 ఫలితాలు విడుదల కానున్నాయి. అందుకే తరచూ టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌ను చెక్ చేస్తూ ఉండండి