ఇద్దరు మహిళా దొంగల హల్ చల్
నాగర్ కర్నూలు, నిర్దేశం:
అచ్చంపేట నియోజకవర్గంలో ఇద్దరు మహిళలు ఇంట్లోకి చొరబడి బంగారు చోరి చేసారు. టీచర్స్ కాలనీలో ధరణి అనే మహిళను బెదిరించి బంగారు ఇద్దరు గుర్తుతెలియని మహిళలు కాజేసారు. బురకాలు ధరించి న్యూ ఎక్సీడ్ స్కూల్ థర్డ్ ఫ్లోర్ కు వెళ్లి అక్కడ ఉన్న మహిళను రూమ్ కిరాయి కావాలంటూ అడిగారు ముసుగు లో వచ్చిన మహిళలు. అద్దెకు రూములు లేవని చెప్పిన చెప్పింది మహిళ. తర్వాత వాటర్ కావాలంటూ అడిగారు ముసుగు మహిళలు. నీటి కోసం లోపలికి వెళ్ళగా ఇంట్లోకి వచ్చి మహిళా మెడకు కండువా వేసి చంపబోయారు. తనను ఏం చేయవద్దు కావాలంటే బంగారు తీసుకోని అంటూ ముసుగు మహిళలతో వేడుకొంది..దాంతో 12 తులాల బంగారు తీసుకొని అక్కడి నుండి ఊడయించారు. విషయం తెలుసుకొని పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. .సీసీటీవీ పుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలు ను పరిశీలిస్తున్నారు.