ఇంతకు కాసిరెడ్డి నారాయణరెడ్డి ఏమయ్యారు..?
– హెబియస్ పిటిషన్ వేసినా లాభం లేదు..
– రెండేళ్లుగా అడ్రసు గల్లంతు..
– కాసిరెడ్డి నారాయణరెడ్డి సికింద్రాబాద్ కుట్ర కేసులో ఉన్నాడు..
సికింద్రాబాద్ కుట్ర కేసులో చాలా ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగిన కాసిరెడ్డి నారాయణ రెడ్డి ఏమయ్యారనే ప్రశ్న సర్వత్ర వినిపిస్తోంది. 1 ఆగష్టు 2022 నుంచి ఆయన అడ్రసు కనిపించడం లేదని అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే.. రెండేళ్లైన కాసిరెడ్డి నారాయణ రెడ్డి అచూకిని కనుగొనక పోవడంతో ఇటీవల హైకోర్టు లాయర్ మల్లికార్జున శర్మ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తప్పిపోయిన కాసిరెడ్డి నారాయణ రెడ్డి అచూకి కనిపెట్టి కోర్టులో హాజరు పరుచాలని న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు.
ఇంకా వెతుకండి..
హెబియస్ కార్పస్ పిటిషన్ ఆదారంగా కాసిరెడ్డి నారాయణ రెడ్డి కోసం వెతికినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఆయన సికింద్రాబాద్ కుట్ర కేసులో ఉండటం వల్ల ఈ కేసుకు ప్రధాన్యత సంతరించుకుంది. కాసిరెడ్డి నారాయణ రెడ్డి అచూకి కోసం టీవీలలో.. సోషల్ మీడియాలో ఫోటోలు ప్రచురించి అచూకి కనిపెట్టాలని కోర్టు తిరిగి ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్లుగా కనిపించకుండా పోయిన కాసిరెడ్డి నారాయణ రెడ్డి ఇంతకు ఏమయ్యారనే ప్రశ్నకు సమాధానం దొరుకడం లేదంటున్నారు ఆయన సన్నిహితులు.