నిర్దేశం, న్యూఢిల్లీ: ఒకవైపు ఢిల్లీలోని బురారీలో కేదార్‌నాథ్ ఆలయ నిర్మాణంపై నిరసనలు జరుగుతున్నాయి. ఈ టైంలో శంకరాచార్య అవిముక్తేశ్వరానంద బాంబు లాంటి వార్త వదిలారు. కేదార్‌నాథ్‌లో బంగారం కుంభకోణం జరిగిందని అన్నారు. అయితే ఈ విషయంపై ఎవరూ ఎందుకు ప్రస్తావించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కేదార్ నాథ్ లో కుంభకోణం జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో కేదార్‌నాథ్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మరో కుంభకోణం జరుగుతుంది’’ అని ఆయన అన్నారు.
ఢిల్లీలోని కేదార్‌నాథ్ ఆలయ నిర్మాణంపై శంకరాచార్య అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని ఢిల్లీలో కేదార్‌నాథ్ ధామ్ పేరుతో ఆలయాన్ని నిర్మించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ చర్య కేదార్‌నాథ్ ధామ్ గౌరవాన్ని, ప్రాముఖ్యతను తగ్గించే ప్రయత్నమని ఆయన విమర్శించారు.