బీజేపీలోకి హరీష్ రావు..?
- 20 మంది ఎమ్మెల్యేలతో జంప్ కు సిద్ధం..
- అవినీతి కేసులకు బీజేపీ శ్రీరామరక్ష..
- బీఆర్ ఎస్ కు పొలిటికల్ దెబ్బ..
(వయ్యామ్మెస్ ఉదయశ్రీ, జర్నలిస్ట్)
పొలిటికల్.. మారుతున్న రాజకీయ సమీకరణాలను అనుకూలంగా మలుచుకోవడంలో మాజీ మంత్రి హరీష్ రావును మించినోడు మరోకరు లేరానేది అక్షరాల నిజం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రత్యేకంగా కాళేశ్వర్ ప్రాజెక్ట్ లో జరిగిన వందల కోట్ల అవినీతిపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణను వేగవంతం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా కొనసాగిన హరీష్ రావు అవినీతిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలతో బీజేపీలోకి..
కాళేశ్వర్ ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి బహిర్గతం అవుతే తన మెడకు చుట్టుకుంటుందని భావించిన హరీష్ రావు ముందు చూపుతో ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీఆర్ ఎస్ రాజకీయాల పరిస్థితులు ఆగమ్యఘోషరంగా మారడంతో తప్పనిసరి తాను సేఫ్ గా ఉండాలంటే బీజేపీలో చేరాడమే మార్గమని ఆలోచన చేస్తున్నట్లు అతని సన్నిహీత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ వైపు చూస్తున్న బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా హరీష్ రావు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
రాబోయే కాలంలో బీజేపీదే హవా..
రాబోయే కాలంలో రాష్ట్రంలో బీజేపీదే హవా ఉంటుందని హరీష్ రావు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజకీయంగా భవిష్యత్ ఉండదని తనతోటి ఎమ్మెల్యే సహచారులకు భరోసాగా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈడీ, సీబీఐ కేసులకు దూరంగా ఉండటానికి బీజేపీ శ్రీరామ రక్షగా ఉంటుందని ఆయన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ పక్షపత వైఖరి..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్ తరువాత స్థానం హరీష్ రావుదే. అయినా.. కేసీఆర్ పక్షపతంలో వ్యవహరించారనడానికి ఎన్నో ఉదాహరణాలున్నాయి. హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు అమెరికాలో జాబ్ చేసుకునే కేటీఆర్ మధ్యలో వచ్చి ఉద్యమంలో చేరారు. కానీ.. కొడుకు అనే ఒక కారణంతో కేటీఆర్ కు ప్రత్యేక స్థానం కల్పించారు. కేసీఆర్. బీఆర్ ఎస్ గౌరవ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన కుమారుడు కేటీఆర్ ను నియమించి తన పక్షపతం నిరూపించుకున్నారు. కేటీఆర్ తో పోల్చితే హరీష్ రావు ఎందులో తక్కువ కాదు. అయినా.. కేటీఆర్ తో పాటు హరీష్ రావుకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వక పోవడం కూడా కారణంగా చెబుతున్నారు.
బీఆర్ ఎస్ అడ్రసు గల్లంతు..
మారుతున్న రాజకీయాల నేపథ్యంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలతో హరీష్ రావు బీజేపీలో చేరితే బీఆర్ ఎస్ అడ్రసు గల్లంతు అవుతుందానే టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిపక్ష హోదాకు సరిపెట్టుకోవడం.. లోక్ సభలో అడ్రసు గల్లంతు కావడంతో రాబోయే కాలంలో బీఆర్ ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.