కువైట్ లో ఘోర విషాదం..
- డబ్బుల సంపాదన కోసం గల్ఫ్ దేశం వెళ్లారు..
- 40 మంది అగ్నికి అహుతయ్యారు..
నిర్దేశం, కువైట్ :
బ్రతుకు తెరువు కోసం కువైట్ వెళ్లిన మనోళ్లు ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదానికి అహుతయ్యారు. అరబ్బీయులు కార్మికులకు సరియైన వసతి, నివాసాలు ఏర్పటు చేయక పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 40 మంది మరణించినట్లు తెలుస్తోంది. అలాగే మరి కొందరు గాయపడినట్లు సమాచారం.
కువైట్ లో అగ్నిప్రమాదానికి గురైన భవనం.. వీడియో..
పొద్దంతా కష్టపడి పని చేసి వచ్చిన వలస కార్మికులు నివాసం ఉండే కువైట్ లోని మంగాఫ్, బ్లాక్ 4 వద్ద తెల్లవారు జామున అగ్ని ప్రమాదం జరుగడంతో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఆ లేబర్ క్యాంపులో 160 మంది నివాసం ఉండగా, అందులో భారతీయులే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కార్మికులు నివాసం ఉండే ఒక భవనంలో మంటలు చెలరేగాయి. ఈ భవనంలో మలయాళీ యాజమాన్యంలోని 160 మంది ఉద్యోగులు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మలయాళీలు. 21 మంది గాయపడ్డారు. వీరిని అదాన్ హాస్పిటల్ లో చేర్చారు. అలాగే 11 మందిని ముబారక్ అల్ కబీర్ హాస్పిటల్లో చేర్చారు.
నలుగురిని జాబీర్ ఆసుపత్రిలో మరియు 6 మందిని ఫర్వానియా ఆసుపత్రిలో చేర్చారు. మంటలు వ్యాపించడాన్ని చూసి పలువురు భయంతో పై నుంచి దూకడంతో కొందరికి గాయాలయ్యాయి.
అగ్ని మాపక దళం, పోలీసులు వచ్చి మంటలను ఆర్పివేశారు. భవనం యొక్క దిగువ అంతస్తులో నిల్వ చేసిన గ్యాస్ సిలిండర్ల కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అంతర్గత మంత్రి ఫహద్ అల్ యూసుఫ్ ప్రమాద స్థలాన్ని సందర్శించి విచారణకు ఆదేశించారు.
ఏది ఏమైనా డబ్బులు సంపాదన కోసం వెళ్లి శవంగా ఇంటికి తిరిగి వస్తారనే సమాచారంతో కుటుంభీకులు రోదిస్తున్నారు.