దేశంలో మళ్లీ ఛక్రం తిప్పేది చంద్రబాబే!

  • చంద్రబాబుకు కలిసొచ్చిన సంధికాలం
    ఫీనిక్స్ పక్షిలా లేచి జాతీయ స్థాయికి
    ఇండీ కూటమితో ఆయనకు నష్టమే

నిర్దేశం, అమరావతి: దలాల్ మార్కెట్లో ఒక సామెత ఉంటుంది. ‘చచ్చిన పిల్లిని అంతెత్తు నుంచి విసిరేస్తే లేచి పరుగెడుతుంది’ అని. రాజకీయాల్లో కూడా ఇలాంటివి సహజమే. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత దిగువ నుంచి హై లెవల్ కు చేరుకున్న చంద్రబాబుకు సుప్రీం ఛాన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే జాతీయ స్థాయిలో ఉన్న నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కూటమిలో కీలకంగా మారారు. ఆ కూటమిలో బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లతో చంద్రబాబే రెండో స్థానంలో ఉన్నారు. దీంతో ఒక్క ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా చంద్రబాబు చక్రం తిప్పనున్నారు.

ఒకానొక సమయంలో ఎన్డీయే కూటమికి కన్వినర్ స్థాయి వరకు వెళ్లారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా మళ్లీ ఏపీ రాజకీయాలకు పరిమితం అయ్యారు. కానీ, ఏ సమయంలోనైనా చంద్రబాబు మళ్లీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపగలరని టీడీపీ శ్రేణులు తరుచూ అంటారు. తాజాగా అదే నిజమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కీలక మంత్రి పదవులు సహా ఇతర కీలక షరతులు బీజేపీకి చంద్రబాబు పెట్టినట్లు తెలుస్తోంది.

ఎన్డీయేనే ఎందుకు?
నిజానికి చంద్రబాబుకు ప్రస్తుతం రెండు దారులు ఉన్నాయి. ఎన్డీయే వైపు వెళ్లవచ్చు, ఇండీ కూటమి వైపు కూడా వెళ్లవచ్చు. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీయేనే లాభదాయకంగా ఉంటుంది. ఇండీ కూటమిలో కాంగ్రెస్ తప్ప ఏ పార్టీకి 40 సీట్లు రాలేదు. పైగా మమతా, అఖిలేష్, స్టాలిన్ వంటి పార్టీలు చంద్రబాబు కంటే ఎక్కువ స్థానాలతో ఉన్నాయి. ఒకవేళ బాబు అటు వెళ్తే.. ఆయన ప్రాధాన్యత 4, 5వ స్థాయికి అంతకంటే కిందికి కూడా పడిపోవచ్చు. కానీ, ఎన్డీయేలో బీజేపీ తర్వాత కీలకంగా ఉండొచ్చు. అవసరమైన పనులను కేంద్రంతో సులువుగా చేయించుకోవచ్చు. అందుకే ఆయన ఎన్డీయే కూటమిని ఎంచుకున్నారు. అయితే చంద్రబాబు తప్పుకుంటే ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది కాబట్టి, బీజేపీకి కూడా ఆయనకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!