మోదీకి బ్రేక్.. ఎన్డీయేకు అధికారం!

  • మూడోసారీ అధికార ఎన్డీయేకే పట్టం కట్టిన ఓటర్లు
    మోదీ ప్రభంజనానికి బ్రేకులు
    290 స్థానాల్లో విజయం సాధించిన ఎన్డీయే
    బీజేపీకి సొంతంగా 239 సీట్లు
    యూపీలో ప్రభావం చూపని రామమందిరం
    ఆశించిన ఫలితాలు సాధించని ఇండీ కూటమి
    99 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్
    యూపీలో బీజేపీకి చెక్ పెట్టిన యూపీ, మహారాష్ట్ర
    ఒక్క సీటూ గెలుచుకోని బీఎస్పీ
    తెలంగాణలో 8 సీట్లు సాధించిన కమలం
    అధికార కాంగ్రెస్ కు 8, బీఆర్ఎస్ కు పూర్తి నిరాశే

నిర్దేశం, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఓటర్లు అంచనాలకు అందని తీర్పు చెప్పారు. భారతీయ జనతా పార్టీ చెప్పినట్టుగా 400 పార్ (400 వరకు) రాలేదు. కాంగ్రెస్ ఆశించినట్లు 300 సీట్లూ రాలేదు. ముచ్చటగా మూడోసారి బీజేపీకే అధికారం కట్టబెట్టినప్పటికీ బలమైన ప్రతిపక్షాన్ని ఎంచుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 272 సీట్లు అవసరం కాగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 290 సీట్లు ఇచ్చి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమికి 235 సీట్లు ఇచ్చారు. బీజేపీ ఊపుకు చెక్ పెట్టడంలో అఖిలేష్ కీలక పాత్ర పోషించారు. బీజేపీ గత రెండు ఎన్నికల్లో యూపీ నుంచే ఎక్కువ సీట్లు సాధించింది. ఈసారి ఎక్కువ సీట్లు అఖిలేష్ సాధించి బీజేపీని వెనక్కి నెట్టారు. ఇక మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభంజనానికి చెక్ పడింది.

గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‭గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. బిహార్, జార్ఖండ్, రాజస్థాన్, కర్ణాటక, అస్సాం, ఒడిశా రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లను సాధించింది. అయితే ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో బీజేపీ తన పట్టును కోల్పోయింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఇండీ కూటమి అనూహ్య విజయాన్ని సాధించింది. బెంగాల్ లో మమతా బెనర్జీ కూడా బీజేపీ జోరుకు చెక్ పెట్టింది. మెజారిటీ స్థానాలను టీఎంసీ కైవసం చేసుకుంది.

దేశం మొత్తం కాస్త వెనుకబడ్డ బీజేపీ తెలంగాణలో పుంజుకోవడం ఆశ్చర్యం. ఏకంగా ఎనిమిది స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలుచుకోగా.. భారత్ రాష్ట్ర సమితి ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఇక ఎంఐఎంకు కంచుకోట అయిన హైదరాబాద్ స్థానంలో మళ్లీ అసదుద్దీన్ ఓవైసీనే గెలుపొందారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం చూపడం ఆశ్చర్యం. కేరళలో ఒక స్థానంతో ఖాతా తెలిచిన బీజేపీ, ఆంధ్రాల్లో మూడు స్థానాలను గెలుచుకుంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!