గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ 

గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ 

◉ కేసీఆర్, మోదీ ఇద్దరూ గల్ఫ్ కార్మికులకు ద్రోహం చేశారు   

◉ వంద రోజుల్లో గల్ఫ్ హామీల అమలుకు పూనుకున్న రేవంత్ రెడ్డి  

◉ త్వరలో దుబాయికి సీఎం రేవంత్ రెడ్డి

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా కాలయాపన చేసి గల్ఫ్ కార్మికులను మోసం చేశాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రవాస భారతీయుల విభాగం (ఎన్నారై సెల్) చైర్మన్ డా. బి. ఎం. వినోద్ కుమార్ ఆరోపించారు. హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో మంగళవారం (02.04.2024) విలేఖరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. 

2023 డిసెంబర్ 7న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. గల్ఫ్ దేశాలలో మృతిచెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును ఇటీవల వేములవాడలో  ప్రారంభించిందని బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ అన్నారు. సీఎం ఏ. రేవంత్ రెడ్డి త్వరలో దుబాయి లో పర్యటిస్తారని ఆయన అన్నారు. 

కేసీఆర్, మోదీ ఇద్దరూ గల్ఫ్ కార్మికులకు ద్రోహం చేశారు   

కేసీఆర్, కేటీఆర్, కవిత లు వివిధ సందర్భాలలో గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వకపోవడం, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించకపోవడం, సమగ్ర ఎన్నారై పాలసీ ప్రకటించకపోవడం, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడం తీవ్రమైన నమ్మక ద్రోహం అని టీపీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఆరోపించారు. 

ప్రధాన మంత్రి హోదాలో మోదీ సౌదీ అరేబియా, యూఏఈ, ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో చాలా సార్లు పర్యటించారు. భారత్ – గల్ఫ్ దేశాల మధ్య చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలలో వ్యాపార వాణిజ్య ఒప్పందాలే ఎక్కువ. గల్ఫ్ వలస కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం గురించి పెద్దగా పట్టించుకోలేదని ఆయన అన్నారు. 

కరోనా సంక్షోభాన్ని క్యాష్ చేసుకున్న కేసీఆర్, మోదీ

కరోనా సందర్బంగా వందే భారత్ ప్లయిట్స్, చార్టర్డ్ ప్లయిట్స్ లలో విదేశాల నుంచి భారత్ కు వచ్చిన మన పౌరుల నుంచి మోదీ ప్రభుత్వం రెండింతలు, మూడింతలు విమాన చార్జీలు వసూలు చేయడం వలన గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన పేద వలస కార్మికులు నష్టపోయారు. కరోనా మహమ్మారి వలన గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చిన పేద కార్మికుల నుంచి క్వారంటైన్ పేరిట కేసీఆర్ ప్రభుత్వం బలవంతంగా  డబ్బులు వసూలు చేసిందని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి విమర్శించారు. 

కరోనాలో హడావిడిగా వాపస్ వచ్చిన ప్రవాసి కార్మికులకు  గల్ఫ్ దేశాల కంపెనీ యాజమాన్యాల నుంచి రావాల్సిన ఉద్యోగ అనంతర ప్రయోజనాలు (ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్) పొందేందుకు న్యాయ సహాయాన్ని అందించలేదు. మానవత్వం మరిచి కరోనా సంక్షోభాన్ని క్యాష్ (లాభసాటి) గా మార్చుకున్న కేసీఆర్, మోదీ లకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని భీంరెడ్డి గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు విజ్ఞప్తి చేశారు.  

గల్ఫ్ వలసలు అధికంగా ఉన్న నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, వరంగల్ ఏడు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని  ‘గల్ఫ్ మైగ్రేషన్ కారిడార్’ లో గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులు, గల్ఫ్ రిటనీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని మంద భీంరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కు, బీజేపీ కి గల్ఫ్ కుటుంబాలు దూరమయ్యాయని భీంరెడ్డి అన్నారు. 

ఇట్లు 
సింగిరెడ్డి నరేష్ రెడ్డి 
+91 90104 44111
+91 98494 22622

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!