బీఆర్ఎస్ గోషామహల్ ఇన్ చార్జి నందకిషోర్ వ్యాస్ రాజీనామా
హైదరాబాద్
బీఆర్ఎస్ గోషామహల్ ఇన్ చార్జి నందకిషోర్ వ్యాస్ పార్టీకి రాజీనామా చేసారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. తన రాజీనామా లేఖను కేటీఆర్ కి, తెలంగాణ భవన్ కి ప్యాక్స్ లో పంపించారు. సీఎం రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేస్తున్న కృషికి ఆకర్షితుడినై తాను కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జాయిన్ అయినాని అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు