ఈవీఎం మెషీన్ల పై అందరు మాట్లాడాలి
: ఆనందా ఓవాల్
నిర్దేశం, ముంభై :
ప్రైవేటీకరణ విధానానికి వ్యతిరేకంగా “మిషన్ జై భారత్” చే ప్రజా చైతన్య సభ బుధవారం మహాత్మా ఫూలే చౌక్, కళ్యాణ్ షాహడ్ లో జరపారు. ముందుగా గాయకురాలు శీతల్ భండారే పాటల ద్వారా ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. విజయ్ హాల్డే సభ ప్రారంభించగా ప్రస్తుత పరిస్థితులపై ఓ వక్త చరణ్ సింగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవక్త అమర్ జోషి పుల్వామా అమరవీరులకు నివాళులర్పించారు.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెబుతూ పుట్టిన ప్రతి బిడ్డపై 1.5 లక్షల అప్పు ఎలా ఉందో ఎత్తి చూపారు. దళిత మేధావి వినాయక్ అఠవాలే, మీరా సప్కాలే, సిన్ను బండికోల, సాక్షి డోలాస్ లు తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. ప్రముఖ అథితి రాజ్యాంగ పండితుడు ఆనందా ఓవాల్ దేశంలోని ప్రస్తుత దయనీయ స్థితికి బాధ్యులెవరో స్పష్టమైన చిత్రాన్ని చిత్రించారు. విటాన్నింటికీ మోడి బీజేపీ ప్రభుత్వమే కారణమన్నారు. రాబోయే ఎన్నికల్లో వారిని ఓడించడం చాలా ముఖ్యం. అందుకు ప్రతి ఓటరు ఓటు వేయాలి.
ఈవీఎం యంత్రానికి భయపడవద్దు. రాజ్యాంగం తమకు ఓటు వేసే హక్కును కల్పించింది. ఐతే ఈవిఎం మెషీన్ గురించి బహిరంగంగా మాట్లాడాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత బలరాం జాదవ్ వహించగా, యోగరాజ్ వాంఖడే కృతజ్ఞతలు తెల్పగా, నవీన్ గైక్వాడ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.