అసెంబ్లీ ఎన్నికల కోసం అగ్ర నేతలంగా బిజీ బిజీ..
- అధికారం ధీమాలో కాంగ్రెస్ ప్రచారం
- మూడోసారి అధికారం కోసం బీఆర్ ఎస్
- కాంగ్రెస్, బీఆర్ ఎస్ తో పోటీ పడుతున్న బీజేపీ
- తగ్గేది లేదంటూ ప్రచారం చేస్తున్న బీఎస్పీ
అసెంబ్లీ ఎన్నికలు.. అవే డైలాగ్ లు.. అవే ఆరోపణలు.. అవే విమర్శలు.. పాపం పొలిటికల్ లీడరులకు అంతకంటే ఇంకేం లేవు. నవంబర్ 30వ తేదీన పొలింగ్ ఉండటంతో అభ్యర్థులలో టెన్షన్ పెరుగుతుంది. ఎలాగైనా గెలువాలని అగ్రనేతలతో సభలు నిర్వహిస్తున్నారు. జనంతో సభలు సక్సెస్ అవుతున్నప్పటికీ వారంతా కూలీ జనమే.. ఆ రోజుకు కూలీ డబ్బులు ఇచ్చి జనంను రప్పించుకుని జనం పుల్ గా వచ్చారని ఆత్మవంచన చేసుకునే వారే. జనంను రప్పించి సభ సక్సెస్ చేసుకునే వారిలో బీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ముందు వరుసలో ఉంటాయి. బీఎస్పీ, కమ్యూనిష్టుల సభలకు మాత్రం జనం స్వచ్ఛందంగా వస్తారు.
కాంగ్రెస్, బీఆర్ ఎస్ మధ్య నువ్వా నేనా అనే రీతిలో ఎన్నికల యుద్దం కొనసాగుతుంది. స్వయం కృపరాదంతో మూడో స్థానం కోసం కొట్లాడుతున్న బీజేపీ కూడా తాము తక్కువేమి కాదని ఎన్నికలలో పోటీ పడుతుంది. మరో ఆరు రోజులలో ఎన్నికలు జరుగుతుండగా కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణలో ప్రచారానికి క్యూ కట్టారు.
అధికారం కోసం కాంగ్రెస్..
అసెంబ్లీ ఎన్నికలలో మెజార్టీ సీట్లు సాధించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ అన్నీ హంగులాలను ఉపయోగించుకుంటుంది. బీఆర్ ఎస్ తో పోటీ పడుతూ సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ డామినెట్ చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కర్ణాటక రాష్ట్రం సీఎం, డిప్యూటీ సీఎంలు ఎన్నికల ప్రచారం చేసారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నీ తానై రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తూ సీఎం కేసీఆర్ కుటుంబంను టార్గెట్ చేస్తున్నారు. ఆరు గ్యారంటీ పథకలతో పాటు మేనిఫెస్టోలోని ఆంశాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ స్ టార్గెట్ గా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
కాంగ్రెస్ ను దెబ్బ తీసి మరోసారి..
బీఆర్ ఎస్ ముగ్గురు ముఖ్యనేతలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ప్రజల వద్దకు వెళుతున్నారు. సీఎం కేసీఆర్, అతని తనయుడు, మంత్రి కేటీఆర్, అతని అల్లుడు హరీశ్ రావులు ముగ్గురు రోజుకు మూడు, నాలుగు బహిరంగ సభలలో ప్రసంగిస్తున్నారు. ఈ ఎన్నికలలో ఊహించని రీతిలో దూసుకు వెళుతున్న కాంగ్రెస్ ను కట్టడి చేయడానికి ఆ ముగ్గురు చేయని ప్రయత్నం లేదు. అయితే.. కాంగ్రెస్ తో పోల్చుకుంటే బీఆర్ ఎస్ సోషల్ మీడియాలో ఒక అడుగు ముందు ఉందని చెప్పచ్చు. విసృతంగా పేపర్, న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియాలలో ప్రకటనలు ఇస్తూ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
తగ్గేది లేదంటున్న బీజేపీ
అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తుంది. ఎన్నికల ప్రకటన వెలువడగానే నిజామాబాద్, మహబూబ్ నగర్ లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో ప్రధాని మోదీ ప్రసంగించారు. సీఎం కేసీఆర్ ను, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే.. బీఆర్ ఎస్, బీజేపీ ఒక్కటే అనే టాక్ ను దూరం చేయడానికి ప్రధాని మోదీ పలుసార్లు కేసీఆర్ పై విరుచుక పడ్డారు. అలాగే హైదరాబాద్ లో జరిగిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన సభలో ప్రధాని మోదీ పాల్గొని వారిని ప్రేమను పొందడానికి ప్రయత్నించారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు లడ్డ పలుమార్లు సభలలో ప్రసంగిచారు. 25వ తేది నుంచి ప్రధాని మోదీ మూడు రోజులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
నేను సైతం అంటూ మాయవతితో బీఎస్పీ సభలు..
అసెంబ్లీ ఎన్నికలలో పుంజుకున్న బీఎస్పీ జోరు మీద ఉంది. ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాల మద్దతుతో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలువాలని భావిస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీల కంటే తాము తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయవతితో బహిరంగ సభలు నిర్వహించి ప్రజలలో బీఎస్పీ సత్తా చేయించారు. సిర్పూర్ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. పది మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని హంగ్ ఏర్పాడితే తామే అధికారంలోకి రావచ్చానే వ్యూహంతో బీఎస్పీ ముందుకు వెళుతుంది.
కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీ, బీఎస్పీలు తగ్గేది లేదంటూ ప్రచారం ముందుకు దూసుకు వెళుతున్న ఈ ఎన్నికలలో బలబలాలు ఎలా ఉంటాయో డిసెంబర్ 3న తేలుతాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
- వయ్యామ్మెస్ ఉదయశ్రీ