దంత సమస్యలపై ప్రజలకు అవగహన కల్పిస్తున్న
ఏవీఆర్ ఫ్యామిలీ డెంటల్ కేర్
నిర్దేశం, సికింద్రాబాద్ :
నోట్లో పన్ను నొప్పి.. అమ్మో ఆ బాధ వర్ణతీతం. నోరు మూసుకోవాలంటే బాధనే.. పండ్లు పుచ్చిపోతే.. చిగురులు ఉబ్బితే ఇంకేంది.. నోట్లో నుంచి రక్తం కారుతుంది. ఆ రక్తాన్ని చూసి భయపడాల్సిందే.
పళ్లు బాగలేక పోతే వెంటనే దంత వైద్యుడి వద్దకు వెళ్లడం చాలా బెటర్ అంటున్నారు సికింద్రాబాద్ లోని అల్వాల్ వెంకటరమణ కాలోనిలో గల ఏవీఆర్ ఫ్యామిలీ డెంటల్ కేర్ డాక్టర్ వంశీక్రిష్ణ రెడ్డి. ప్రజలకు అవగహన లేక పోవడం వల్లే తరచు దంతంకు సంబంధించిన సమస్యలతో ప్రజలు బాధ పడుతున్నరంటున్నారు ఆయన.
ఏవీఆర్ ఫ్యామిలీ డెంటల్ కేర్ లో..
వైద్యం వ్యాపారంగా మారిన నేటి కాలంలో కార్పోరేషన్ వైద్యంతో పోల్చితే ఏవీఆర్ ఫ్యామిలీ డెంటల్ కేర్ లో చాలా తక్కువ ఫీజులకే వైద్యం అందిస్తున్నారు. దంత సమస్యలతో వచ్చే వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఫీజులు తీసుకుంటున్నారు. నర్సరావు పేటకు చెందిన డాక్టర్ వంశీక్రిష్ణ రెడ్డి విద్యార్థి దశలోనే వైద్యుడిగా పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో పని చేస్తున్నారు. పేదలు నివాసం ఉంటే కాలోనిలలో, ప్రభుత్వ స్కూల్ లలో విద్యార్థులకు దంత సమస్యలపై అవగహన పెంచుతున్నారు. ఈ అవగహన ప్రోగ్రాంలలో వాలంటీరులుగా రజిత, షమీన్ పని చేస్తున్నారు.
ఏవీఆర్ ఫ్యామిలీ డెంటల్ కేర్ లో..
డాక్టర్ వంశీక్రిష్ణ రెడ్డి కిడ్స్ డెంటల్ స్పెషాలిస్ట్, డెంటల్ సర్జన్ కూడా. దంత సమస్యలు ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ వాటికి తక్కువ ఖర్చుతో వైద్యం చేయడం ఆ డాక్టర్ ప్రత్యేకత. వంకర పళ్లను సరి చేస్తారు. పుచ్చి పోయిన పళ్లను సరి చేస్తారు. సర్జరీ ద్వారా చిగుర్ల సమస్యలకు వైద్యం చేస్తారు. పళ్లు తెల్లగా చేస్తారు. వృద్దులకు పూర్తి పళ్ల సెట్లను అందంగా పెడుతారు. రూట్ కెనాల్ ట్రీట్ మెంట్, లేజర్ ట్రీట్ మెంట్, అత్యధునిక కట్టుడు పళ్లను ఏవీఆర్ ఫ్యామిలీ డెంటల్ కేర్ లో పెడుతారు.