నిజామాబాద్ జిల్లాలో ఐదు చోట్ల పోటీలో రెడ్డీలు..
– నిజామాబాద్ రూరల్ నుంచి ఒక్కరే బీసీ..
– ముప్పై ఏళ్లుగా రెడ్డీలకు ఎదురీదుతున్న బాజిరెడ్డి గోవర్ధన్
నిర్దేశం, నిజామాబాద్ :
నిజామాబాద్ జిల్లాలో ఐదు శాతం లేని అగ్రవర్ణాలే ఎమ్మెల్యేలు అవుతున్నారు. 85 శాతం ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఓటు వేయడానికి పరిమితమవుతున్నారు. అగ్రవర్ణాలైన రెడ్డిల మధ్య పోటీ పడుతున్నారు నిజామాబాద్ రూరల్ బీఆర్ ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్,
అసెంబ్లీ ఎన్నికలు రాగానే అగ్రవర్ణాలు తమకు టికెటు రావాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చి ఎలాగో సీటు సంపాదించుకుని ఎన్నికలలో పోటీ పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. ఆర్మూర్ నుంచి జీవన్ రెడ్డి, బాల్కొండ నుంచి ప్రశాంత్ రెడ్డి, బోధన్ నుంచి మైనార్టీ నాయకులు షకీల్, నిజామాబాద్ అర్బన్ నుంచి వైశ్యుడు బిగాల గణేష్ గుప్తా ( ఓసీ) పోటీ చేస్తున్నారు. అయితే.. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసేది మాత్రం ఒక్కరే బీసీ నేత బాజిరెడ్డి గోవర్ధన్.
బీసీ నేతను ఓడించడానికి రెడ్డీలు..
బాజిరెడ్డిని గెలిపించడానికి ఒక్కటైన బీసీ జనం
నిజామాబాద్ రూరల్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న బీసీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ ను ఓడించడానికి రెడ్డీలంతా ఒక్కటయ్యారు. మెజార్టీ బీసీ జనం ఉన్నప్పటికీ డబ్బులు ఇచ్చి ఎలాగైన కాంగ్రెస్ అభ్యర్థి భూపాత్ రెడ్డిని గెలిపించుకోవాలని రెడ్డి సామాజిక వర్గం వ్యూహం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ విషయాన్ని గుర్తించిన ముదిరాజ్, మున్నూరు కాపు, ఇతర బీసీ కులస్థులు బీసీ నేత బాజిరెడ్డి గోవర్దన్ ను ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీసీ నేతలే స్వయంగా నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో గ్రామాలకు వెళ్లి తమ బీసీ నేతను గెలిపిద్దాం అంటూ ప్రచారం చేస్తున్నారు.