ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు హేయనీయం

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు హేయనీయం
వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలి

: ముదిరాజ్ సంఘం డిమాండ్

హైదరాబాద్ జూన్ 24 : హుజరాబాద్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జిఎస్సార్ సోషల్ మీడియాకు సంబంధించిన ఒక రిపోర్టర్ ను బంధించి కిడ్నాప్ చేసి ఇష్టమున్నట్టు కొట్టి చంపుతామని బెదిరించడాన్ని ముదిరాజ్ సంఘం జేఏసి జైంట్ కన్వినర్ పగడాల సుదాకర్ ముదిరాజ్ తీవ్రంగా ఖండించారు.

రాష్ట్ర నాయకులు ముదిరాజ్ అని చెప్తే నీ ముదిరాజులు వచ్చి నా … అన్ పార్లమేంట్ పదాన్ని వాడి ముదిరాజ్ల ఆత్మా గౌరవాన్ని కిన్చపరిచినాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ జాతిని యావత్తు అవమానించిన పాడి కౌశిక్ రెడ్డిని మన ముదిరాజుల సత్తా ఏమిటో చూపించాలని పిలుపునిచ్చారు.

పాడి కౌశిక్ రెడ్డి అనే దుర్మార్గుడు తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి ముదిరాజులపై తన అక్కస్సును మరియు వ్యతిరేక భావాన్ని వ్యక్తపరచడమే కాకుండా, వారిపై తన అధికారం మదంతో అక్రమ పోలీసు కేసులు బనాయించి వేధించడం పరిపాటుగా మారిందన్నారు.

హనుమకొండ జిల్లాలోని జి ఎస్ ఆర్ టి వి అనే ఛానల్ లో పనిచేసే ముదిరాజ్ బిడ్డ అజయ్ నీ కిడ్నాప్ చేసి తనకు అనుకూలంగా టీవీ లో ప్రచారం చేయాలని లేకుంటే మీ అంతు చూస్తానని చెప్పి బెదిరించడమే కాకుండా, అతనిపై భౌతికంగా దాడి చేయడం జరిగిందని తెలిపారు. ఈ విషమం పై తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకత్వం వెంటనే స్పందిచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముదిరాజుల జోలికొస్తే ఎలా ఉంటుందో మీరందరూ వానికి బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేసారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!