బీజేపీ వైపు కేసీఆర్ అడుగులు
: మానిక్ రావు టాక్రే
హైదరాబాద్, జూన్ 23 : తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పై విశ్వాసం పెరుగుతుంది. పాట్నాలో విపక్షాల మీటింగ్ జరుగుతుంది. మరో వైపు ఢిల్లీలో బి.ఆర్ ఎస్ నేతలు బీజేపీ తో మంతనాలు జరుపుతున్నారు. ప్రతిపక్షాల సమావేశంలో రోజే బీజేపీ మంత్రులను కేటీఆర్ ను కలవడంలో ఆంతర్యం ఏమిటని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మానిక్ రావు ఠాక్రే ప్రశ్నించారు. బిజెపితో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతుంది. అందుకే బిఆర్ఎస్ నేతలు బిజెపి నాయకులతో భేటీ అవుతున్నారు. కవితకు ఈడి నోటీసులు ఇచ్చింది. అరెస్ట్ చెయ్యడం లేదనిఅన్నారు. కేసీఆర్ అడుగులు బిజెపి వైపు పడుతున్నాయి. బీజేపీ ,బి ఆర్ ఎస్ నేతలు చాలా మంది టచ్ లో ఉన్నారరు. త్వరలో కాంగ్రెస్ లో చాలా చేరికలు ఉంటాయని అయన వెల్లడించారు.