ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే అలవెన్స్ పెంపు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్ జూన్ 23 : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే అలవెన్స్‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం జీవో ప్రకారం ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీయన్స్, సెలవు రోజుల్లో ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే అలవెన్స్ 30 శాతం పెంచింది. అలాగే సెలవు రోజుల్లో పనిచేసే లిప్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లకు అదనంగా రూ.150 చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ 30 శాతం పెంచింది. దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ రూ. 2000 నుంచి రూ. 3000 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.