నకిలీ చాక్లెట్ల గుట్టు రట్టు
రంగారెడ్డి, ఏప్రిల్ 12 (వైడ్ న్యూస్) రంగారెడ్డి రాజేంద్రనగర్ అత్తాపూర్ లో ఎస్వోటీ పోలీసులు దాడులు జరిపారు. అక్కడి చాక్లెట్ పరిశ్రమ పై దాడులు నిర్వహించారు. దాడుల్లో నకిలీ చాక్లెట్లు, లాలీ పప్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది.
చిన్నారుల ప్రాణాల తో చెలగాటం యాజమాన్యం యజమాన్యం. ప్రమాదకరమైన రసా యనాలు వాడి చాక్లెట్లు, లాలీ పప్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వాటికి బ్రాండెడ్ స్టిక్కరింగ్ వేసి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పరిశ్రమ పై దాడులు నిర్వహించారు. ఇస్సార్ అహ్మద్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.