50 శాతం రిజర్వేషన్ల కై 3న ఛలోఢిల్లీ
పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన
హైదరాబాద్ ఏప్రిల్ 1 (వైడ్ న్యూస్) బి.సి లకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ -3న పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన జరపాలని నిర్ణయించినట్లు రాజ్యసభ జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఈరోజు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ అంధోళన కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఒరిస్సా రాష్ట్రాల నుండి వేలాది మంది పోల్గొంటారని తెలిపారు. ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ – పార్లమెంట్ ఎన్నికలలో బి సి లకు అన్ని రాజకీయ పార్టీలు బి సి లకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని కోరారు.
బి.సి లకు అన్యాయం చేసే పార్టీల బరతం పడతామని హెచ్చరించారు. ఈ దేశంలో బి.సి లను బిచ్చగాళ్ళను చేశారని విమర్శించారు. బి.సిలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండ గొర్రెలు – బర్రెలు –పందులు – పెన్షన్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని బి.సిలను శాశ్వత బిచ్చగాళ్ళను చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ రచన సమయంలోనే బి.సిలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాలలో రిజర్వేషన్లు పెడితే ఎంతో ప్రగతి జరిగేది.
కులతత్వం కనీస స్థాయికి వచ్చేది. ఈ దేశంలో బీసీలుగా పుట్టాడమే నేరమా! రాజ్యాంగ బద్దమైన హక్కులు ఇవ్వరు. ప్రజా స్వామ్య బద్దమైన ఇవ్వరా! మేము భారత మాత బిడ్డలమ్ కాదా! కుళ్ళు రాజకీయాలు – స్వార్ద రాజకీయాల కోసం మా భవిష్యత్ దెబ్బ తీస్తారా!అని ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలు బి సి లను ఓటు బ్యాంకు గా వాడుకుంటున్నారు.
రాజ్యాధికారంలో వాట ఇవ్వకుండా 75 సం.లుగా అన్యాయం చేస్తూన్నారు. జెండాలు మోసుకుంటు, జిందాబాద్ ల నినాదాలు ఇస్తూ బిసిలను వాడుకుంటున్నారని అన్నారు.ఈ కార్యక్రమానికి బిసి జాతీయ కన్వీనర్ గుజ్జ సత్యం, ఎర్ర సత్యనారాయణ,రాజేందర్, అనంతయ్య, అంజి, వేముల రామకృష్ణ, సతీష్, ఎం.పృధ్వీ రాజు గౌడ్, నిఖిల్, సురేష్, పండరి నాద్ తదితరులు పాల్గొన్నారు.