16 నుండి బుగ్గారం లో శ్రీ సాంబశివుని
“‘మహాశివరాత్రి జాతర'”
జగిత్యాల జిల్లా లోని బుగ్గారం మండల కేంద్రం సాంబుని గుట్ట వద్ద గల “‘సంతానయుక్త శ్రీ సాంబశివ నాగేశ్వరాలయం”‘ లో ఫిబ్రవరి 16 నుండి 19 వరకు మహాశివరాత్రి జాతర ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మసర్ధి రాజిరెడ్డి తెలిపారు.
శ్రీహరి మౌన స్వామిజీ ఆధ్వర్యంలో శివదీక్షా స్వాములతో కలిసి ఆలయ కమిటీ చైర్మన్ మసర్ధి రాజిరెడ్డి, విడిసి కోర్ కమిటీ చైర్మన్ చుక్క గంగారెడ్డి లు జాతర కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మసర్తి రాజిరెడ్డి మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో నూతనంగా శ్రీ సంజీవని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఈనెల 16న ప్రతిష్టాపన చేయనున్నట్లు తెలిపారు. 17న స్త్రీలచే కుంకుమార్చన, దంపతులతో 27 కుండలాల గీతాహవన యజ్ఞం, 18న మహాశివరాత్రి జాతర, శివపార్వతుల కళ్యాణం జరుగనున్నాయని ఆయన పేర్కొన్నారు. 19న అంగరంగ వైభవోపేతంగా శ్రీ సాంబశివ నాగేశ్వర స్వామి రథోత్సవం జరుగనుందన్నారు.
అలాగే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 18 శనివారం ఉదయం 8-00 గంటల నుండి 19 ఆదివారం ఉదయం 8:00 గంటల వరకు ప్రముఖ ఆధ్యాత్మిక కళాకారులు నక్క రాజు చే “’24 గంటల మహా సంకల్ప గాన స్వరాభిషేకం”‘ నిర్వహించబడునని ఆయన తెలిపారు.
యావత్ భగవత్ బంధువులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ప్రముఖులు ఈ నాలుగు రోజుల పాటు జరుగనున్న ఆలయ 17వ వార్షికోత్సవ, మహాశివరాత్రి జాతర ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.