కోమ్రరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామంలో మొన్న పెద్దపులి దాడిలో మృతిచెందిన నిర్మల తల్లిదండ్రులను పరామర్శించి రూ5000లా హార్ధిక సహాయం అందించిన *బీజేపీ సీర్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ డా.కొత్తపల్లి శ్రీనివాస్ అనంతరం వారు మాట్లాడుతు కొద్దిరోజుల ముందు దహేగం మండలం దిగిడ గ్రామంలో పులి దాడి లో సిడాo విఘ్నేష్ మరణించిన విషయం తెలిసిందే, అప్పటినుండి ఇప్పటి వరకు మేకలు ,ఆవులమంద లపై దాడి చేసిందని అయినా ఫారెస్ట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా మరొక ప్రాణం పోక ముందు ఆ పులిని బంధించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పసుల నిర్మల కుటుంబాన్ని ఇచ్చిన 5దు లక్షలు కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ద్వారానే పంపిణీ చేసారని రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆ కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా, ఐదెకరాల భూమి, ఇంటిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ప్రభుత్వం కట్టిస్తాను అన్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ జరిగిన పులి దాడినైన గుణపాఠంగా తీసుకోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజ్ధుర్ సెల్ కన్వీనర్ శరద్ శర్మ, దళితమోర్చా అధ్యక్షులు లహన్ రాజ్, మండల అధ్యక్షులు తుమిడే భాస్కర్ ఉపద్యక్షులు ఎల్కారి బాపూజీ, పోతే గంగారాం శ్రీనివాస్ ,అశోక్,సిద్ధు, పాల్గొన్నారు….అడేపు దేవేందర్ ప్రజానేత్ర.