బుర్ఖా తీసేస్తే మ‌ర‌ణ‌శిక్షే.. అత్యంత నీచానికి దిగ‌జారిన‌ ఇరాన్

నిర్దేశం, టెహ్రెన్ః ఇస్లాం దేశాలంటే మ‌హిళా వ్య‌త‌రేక‌మ‌నే దానికి మ‌రింత బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటున్నారు. అఫ్గానిస్తాన్ లో తాలిబ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డ అనంత‌రం అక్క‌డి బాలిక‌ల‌కు చ‌దువును కొంత వ‌ర‌కే ప‌రిమితం చేశారు. ఇక మ‌హిళ‌ల మీద అనేక ఆంక్ష‌లు విధించారు. ఒక్క అఫ్గ‌నే కాదు.. చాలా ఇస్లాం దేశాల్లో ఇలాంటి దుర్మార్గ‌పు చ‌ట్టాలే ఉన్నాయి. అయితే, ఇరాన్ మ‌రో ముంద‌డుగు వేసి హిజాబ్ ను క‌ఠిన‌తరం చేసింది. ఎంత‌లా అంటే.. హిజాబ్ వేసుకోకుంటే మ‌ర‌ణశిక్ష విధిస్తార‌ట‌.

ఇప్ప‌టికే హిజాబ్ గొడ‌వ‌లో ఇరాన్ అట్టుడుకుతోంది. మోర‌ల్ పోలీసుల చ‌ర్య‌ల్లో మ‌హ్సా అమిని బ‌లైన‌ అనంత‌రం హిజాబ్ కు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు లేశాయి. ఇప్ప‌టికీ జరుగుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఇలాంటి కిరాత‌క చ‌ట్టానికి పూనుకుంది అక్క‌డి ప్ర‌భుత్వం. కొత్త చట్టంలోని ఆర్టికల్ 60 ప్రకారం.. హిజాబ్ లేకుండా క‌నిపించిన మహిళలకు జరిమానా, కొరడా దెబ్బలు, కఠిన కారాగార శిక్ష విధిస్తారు.

ఎవ‌రైనా మహిళ ఈ చట్టాన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు ఉల్లంఘిస్తే 15 సంవత్సరాల జైలు శిక్ష లేదా మరణశిక్షను అనుభవించవలసి ఉంటుంది. ఇది కాకుండా, ఇరాన్ అధికారులు వివాదాస్పద హిజాబ్ క్లినిక్‌ను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు, దీని ఉద్దేశ్యం హిజాబ్ నిబంధనలను అమలు చేయడం.

విదేశీ మీడియా, సంస్థలపై కఠిన చర్యలు

ఏదైనా విదేశీ మీడియా ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక అభిప్రాయాలను ప్రచారం చేస్తే, దానికి 10 సంవత్సరాల జైలు శిక్ష, 12,500 పౌండ్ల వరకు జరిమానా విధిస్తార‌ట‌. అలాగే, ఎవరైనా మహిళ అరెస్టును అడ్డుకోవడానికి లేదా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, అతనికి కూడా శిక్ష ప‌డుతుంది. అలాంటి వారిని నేరుగా జైలులో పెడ‌తామ‌ని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

2022లో హిజాబ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు

1979లో ఇస్లామిక్ విప్లవం అనంత‌రం ఇరాన్‌లో మహిళలు బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి చేశారు. అయినప్పటికీ 2022లో ఈ హిజాబ్ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి. ఈ నిరసనకు ప్రధాన కారణం 16 సెప్టెంబర్ 2022న 22 ఏళ్ల మహ్సా అమిని పోలీసు కస్టడీలో మరణించడం.

హిజాబ్ ధ‌రించాల‌నే నిబంధ‌న‌ను ఉల్లంఘించినందుకు మహ్సా అమినీని మోర‌ల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె మరణానంతరం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అందులో వందలాది మంది మరణించారు. ఈ సంఘటనల తరువాత, అనేక నిరసనలను అణిచివేసేందుకు ప్రభుత్వం వేలాది మందిని అరెస్టు చేసింది. ఇప్పుడు రెండు సంవత్సరాల తరువాత, ప్రభుత్వం మరింత కఠినమైన హిజాబ్ చట్టాలను అమలు చేసింది.

కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు

ఇరాన్‌లో అమలవుతున్న ఈ కొత్త చట్టాలు దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా వివాదానికి కారణమయ్యాయి. ఈ చట్టాలను మహిళల హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తూ మానవ హక్కుల సంస్థలు, ప్రపంచ సమాజం నిరసన వ్యక్తం చేశాయి. ఈ చర్య మహిళల స్వేచ్ఛ, హక్కులకు భంగం కలిగిస్తుందని వారు అంటున్నారు. అయితే, ఈ చట్టాల ఉద్దేశ్యం సమాజంలో హిజాబ్ సంస్కృతి పవిత్రతను కాపాడటం, మహిళలను ఒక నిర్దిష్ట రకమైన దుస్తులను అనుసరించేలా ప్రేరేపించడం అని ఇరాన్ ప్రభుత్వం చెబుతోంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!